Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టడీ వీసాపై హైదరాబాద్ రాక... ఆపై గుట్టుగా వ్యభిచారం

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (09:52 IST)
పలు విదేశాలకు చెందిన యువతులు స్టడీ వీసాపై హైదరాబాద్ నగరానికి వస్తున్నారు. ఆపై గుట్టుగా వ్యభిచారం చేస్తున్నారు. తాజాగా స్టడీ వీసాపై టాంజానియా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ జంట వ్యభిచారం చేస్తూ పట్టుబడటంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. 
 
హైదరాబాద్ నగర పోలీసులు వెల్లడించిన కథనం మేరకు... డయానా (24), కాబాంగిలా వారెన్ (24) అనే టాంజానియాకు చెందిన యువతీ యువకులు స్టడీ వీసాపై గతేడాది జనవరిలో హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి తార్నాకలో ఉంటున్న వీరు రెండు నెలల క్రితం భార్యభర్తలమని చెప్పి నేరెడ్‌మెట్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు.
 
తర్వాత ‘మీట్ 24’ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న డయానా వ్యభిచారం నిర్వహిస్తోంది. వినియోగదారులను నేరుగా ఇంటికే పిలిపించుకునేది. అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నేరెడ్‌మెట్ పోలీసులు డెకాయి ఆపరేషన్ నిర్వహించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 
 
వారి నుంచి పాస్‌పోర్టులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీసా గడువు ముగిసినప్పటికీ వారు అక్రమంగా ఇక్కడే ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments