ఈ ట్యూబ్‌లైట్ ఐడియా ఎక్కడా లేదు : ప్రధానిపై ఓవైసీ విమర్శలు

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (21:47 IST)
ప్రధాని నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోమారు విమర్శలు గుప్పించారు. ఈ నెల 5వ తేదీన రాత్రి 9 గంటలకు ప్రతి ఒక్కరూ తమతమ గృహాల్లో విద్యుత్ దీపాలను ఆర్పివేసి.. కొవ్వొత్తులు, టార్చిలైట్లు వెలిగించాలంటూ దేశ ప్రజలను ప్రధాని మోడీ కోరాు. దీనిపై అసదుద్దీన్ స్పందించారు. 
 
'ఈ దేశం ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కాదు. భారతదేశ ప్రజలందరూ మనుషులే, వారికీ ఆశలు, ఆశయాలు ఉంటాయి. 9 నిమిషాల గిమ్మిక్కులతో జీవితాలను దిగజార్చవద్దు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఏం లభిస్తోంది? పేదవాళ్లకు ఎలాంటి ఊరట దక్కుతోంది? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాం. చేయాల్సింది చేయకుండా మళ్లీ ఓ కొత్త డ్రామాకు తెరలేపారు' అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. 
 
అంతేకాకుండా 'ఈ తరహా ట్యూబ్ లైట్ ఐడియా ఎక్కడా కనలేదు, వినలేదు. దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఆకలితో అలమటిస్తూ, గూడు లేక కాలినడకన ఇళ్లకు పయనమయ్యారు. ప్రధానిగారూ, ఎక్కడుంది మీరు చెబుతున్న వెలుగు? వలస కార్మికుల ద్వారా కరోనా ఇన్ఫెక్షన్లు మరింత ప్రబలమవుతాయని మీ లాయర్లు సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు. కానీ మీ ఆరోగ్యమంత్రిత్వ శాఖ భారత్లో  సామాజిక సంక్రమణం ద్వారా కరోనా వైరస్ వ్యాపించడం తక్కువేనని చెబుతోంది. ఆర్థికసాయం అందించాలని సీఎంలు కోరుతుంటే లైట్లు ఆర్పేయాలని చెబుతారా?' అంటూ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా.. చల్లారని వివాదం

Chiranjeevi: పునాదిరాళ్లు సినిమా కోసం కెమెరా ముందు నిలిచిన తొలి రోజు

ఆనాటి ఆ స్పెషల్ ఆలోచనే టాలీవుడ్ మెగాస్టార్‌ను స్పెషల్ స్టార్‌ను చేసాయ్

Singer Sunitha: లవ్ స్టోరీలో కె.జి.ఎఫ్. లాంటి చిత్రం నిలవే

Nikhil: వెయ్యి ఏళ్ల క్రితం చిత్తూరు లోని కృష్ణ అనే వారియర్ కథ స్వయంభు : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా గుండె వాల్వ్ చికిత్స

TrueSilver లాంచ్ ద్వారా దేశీయ డీ2సీ సిల్వర్ జ్యూవెలరీ మార్కెట్ లోకి ACPL ఎక్స్ పోర్ట్స్

అమెజాన్‌లో వ్యాలెంటైన్స్ డే స్టోర్‌తో ప్రేమ సంబరాలు జరుపుకోండి

ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి రక్తనాళాల ఆరోగ్యం కీలకం: నిపుణుల ఉద్ఘాటన

గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించే టాబ్లెట్స్ పరగడుపున వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

తర్వాతి కథనం
Show comments