నాస్తికుడు బైరి నరేష్‌ను మరోమారు చితక్కొట్టిన అయ్యప్ప భక్తులు

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2023 (10:02 IST)
కోట్లాది మంది హిందువులు ఆరాధించే శబరిమల అయ్యప్ప స్వామిని కించపరిచేలా, అయ్యప్ప మాలను ధరించే భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన నాస్తికుడు బైరి నరేశ్‌కు భక్తులు మరోమారు దేహశుద్ధి చేశారు. పోలీస్ వాహనం నుంచి కిందకు లాగిమరీ చితక్కొట్టారు. ఈ ఘటన వరంగల్ జిల్లా హన్మకొండలోని గోపాల్ పూర్ ఏరియాలో జరిగింది.
 
అయ్యప్ప స్వామిని, అయ్యప్ప భక్తులను చులకన చేసి మాట్లాడటంతో జీర్ణించుకోలేని అనేక మంది అయ్యభక్తులు, హిందువులు కలిసి గోపాల్ పూర్ ప్రాంతంలో దాడి చేశారు. అయ్యప్ప స్వామిపై మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని వెహికల్ ప్రొటెక్షన్‌ ఫోర్స్ వాహనంలో తరలిస్తుండగా, పలువురు భక్తులు వాహనాన్ని అడ్డుకుని, ఆ వాహనం నుంచి నరేశ్‌ను కిందకులాగి దేహశుద్ధి చేశారు.
 
దీనిపై నరేశ్ స్పందిస్తూ, తనపై దాడి చేస్తారనే పోలీసుల రక్షణ కోరానని, పోలీసులు వాహనంలో ఉండగానే తనపై దాడి చేశారని చెప్పారు. పోలీసులు వాహనంలో వెళుతుంటే వెంబడించి దాడి చేశారని వాపోయాడు. తనకు గన్‌లైసెన్స్ కావాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments