ఎంతోమందిని చూసాం.. ఆఫ్ట్రాల్ నువ్వెంత?

Webdunia
ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (16:37 IST)
"కేసీఆర్!.. నువ్వు ముఖ్యమంత్రివా లేక భూముల బ్రోకర్ వా... నీ లాంటి వాళ్ళను ఎంతో మంది చూసాం.. నువ్వెంత ఆఫ్ట్రాల్..." అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు నిప్పులు చెరిగారు.

రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలం కురుమిద్ద గ్రామంలో ఫార్మా సిటీ భూ భాదిత రైతుల సమావేశంలో.. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై మాటల తూటాలు పేల్చారు. భట్టి విక్రమార్క ప్రసంగిస్తున్నంత సేపు ప్రజలు చప్పర్లు, ఈలలతో తమ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే కోదండ రెడ్డి, మాల్ రెడ్డి రంగారెడ్డి, డిసిసి అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ సుంకేట అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ నాడు ఇందిరమ్మ పేదలు కోసం భూములు కేటాయిస్తే.. కేసీఆర్ దళారీగా మారి ఆ భూములను కార్పొరేట్లకు పంచుతున్నారని అన్నారు. ఇప్పుడు మనం పోరాటం చేస్తే పోయేది బానిస సంకెళ్లు మాత్రమేనన్నారు. భూమికి మనిషికి భావోద్వేగపూరిత బంధం ఉందని.. దానిని లాక్కుంటే సహించేది లేదని అన్నారు.

మా భూమి జానెడు లాక్కునే ప్రయత్నం చేస్తే ప్రాణాలు అయినా ఇస్తాం కానీ దానిని వదులుకునేది లేదని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం పంపిణీ చేసిన 8 వేల ఎకరాలు, రైతుల 12 వేల ఎకరాలు మొత్తంగా 20 వేల వ్యవసాయ భూములను ఫార్మాసిటికి ధారాదత్తం చేస్తే ఊరుకునేది లేదని భట్టి ఈ సందర్భంగా హెచ్చరించారు.
 
ఒక చిన్న పరిశ్రమవల్ల గ్రామం మొత్తం కలుషితం అయితే.. ఈ ఫార్మాసిటి చుట్టూ వంద కిలోమీటర్ల మేర కలుషితం కావడంతో పాటు.. భూగర్భ జలాలు, కృష్ణ నీళ్లు కలుషితం అవుతాయని భట్టి చెప్పారు. 
 
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు, పేదలు, భూమిలేని నిరుపేదల కోసం ఇచ్చిందని  హెప్పారు. రైతులు, పేదల భూమికి ఎవరైనా అడ్డువస్తే కాంగ్రెస్ నాయకత్వం అంతా అడ్డుగా వస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

DSP: ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్ ప్రోమో - పవన్ కు గిఫ్ట్ ఇది : దేవీశ్రీ ప్రసాద్

DiL Raju: నిర్మాత అంటే విలువలేదు - కానీ సినిమా తీస్తా : దిల్ రాజు

తండ్రి కూతురు సెంటిమెంట్ తో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్

Sri Vishnu: విష్ణు విన్యాసం స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది : శ్రీ విష్ణు

Anupama: అనుపమ పరమేశ్వరన్ తో అగ్ర నిర్మాణ సంస్థ కొత్త మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

తర్వాతి కథనం
Show comments