తెలంగాణలో జులై 6 నుంచి 9 వరకు ఎంసెట్- రీ-షెడ్యూల్ విడుదల

Webdunia
శనివారం, 23 మే 2020 (18:19 IST)
కరోనా ప్రభావం రాష్ట్రంలో అన్ని రంగాలతో పాటు విద్యావ్యవస్థపై పడటంతో అన్ని పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు తేదీలు ఖరారు కావడంతో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలపై శనివారం తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ఇంకా ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షలకు సంబంధించిన రీ-షెడ్యూల్‌ను వెల్లడించింది తెలంగాణ ఉన్నత విద్యామండలి. 
 
సబితా ఇంద్రారెడ్డితో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, కళాశాల, టెక్నికల్ విద్యా శాఖ కమిషనర్, ఉన్నత విద్యామండలి అధికారులు సమావేశమై ఎంసెట్ ,ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలపై చర్చ జరిపి చివరికి డేట్లు ప్రకటించారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ప్రవేశ పరీక్షను జూలై 6 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. జూలై 8 నుంచి లాసెట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 
 
ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ :
ఎంసెట్- జులై 6 నుంచి 9 వరకు
ఈసెట్ - జులై 4
లాసెట్- జులై 10
టీఎస్ పీజీఈసెట్- జులై 1 నుంచి 3 వరకు
టీఎస్ పాలిసెట్- జులై 1
ఐసెట్- జులై13
ఎడ్‌సెట్- జులై 15

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

INCA: ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక

Chiranjeevi: సురేఖ నా భార్య మాత్రమే కాదు, నా బలం, నా అండ, నా ప్రశాంతత : చిరంజీవి

కన్నడలోనూ అద్భుతమైన టాక్‌తో షెరాజ్ మెహదీ.. ఓ అందాల రాక్షసి

Faria Abdulla: సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా కాంబినేషన్ లో చిత్రం

ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై చిల్డ్రన్ మూవీగా సమ్మర్ హాలిడేస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments