ఉమ్మడి నల్గొండ జిల్లాలో మృత్యుఘోష...

Webdunia
బుధవారం, 5 మే 2021 (10:36 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనాతో నిన్న ఒక్కరోజే 14 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా 2,234 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నల్గొండ జిల్లాలో 1,213, సూర్యాపేట జిల్లాలో 593, యాదాద్రి-భువనగిరి జిల్లాలో 528 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 
 
మరోవైపు, రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగనుంది. కోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం అమలు చేసింది. మే 8 వరకు తెలంగాణలో  నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ఈరోజు మరోసారి హైకోర్టులో విచారణ జరుగనుంది. 
 
యాదగిరిగుట్టలో బుధవారం నుంచి 10 రోజుల పాటు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రభుత్వం లాక్డౌన్ విధించనుంది. స్వచ్ఛందంగా షాపుల మూసివేతకు షాప్ ఓనర్లు నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎరుకల సుధ సూచించారు. అత్యవసర, నిత్యావసర సేవలకు దీని నుంచి మినహాయింపు ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naresh Vijaya Krishna: తమిళనాడు ఆదర్శంగా ఆంధ్ర లో కొత్త రాజకీయ శక్తి : నరేష్ విజయ కృష్ణ

M.S. Raju: మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ గా అగధ వుంటుంది : ఎం.ఎస్. రాజు

చంపడం సరదా కాదు.. అలా అని క్షమించడం చేతకాదు...వసుదేవసుతం రిలీజ్ ట్రైలర్

Eluru Srinu : బర్నింగ్‌ ఇష్యూ ఆధారంగా డ్యూ డేట్‌ చిత్రం ప్రారంభం

Toxic song: యశ్, కియారా అద్వానీ మధ్య కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా తబాహీ సాంగ్

తర్వాతి కథనం
Show comments