Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరెస్ ఎలర్ట్, మేం సిద్ధంగా వున్నాం: ఈటెల రాజేందర్

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (16:58 IST)
కరోనా వైరస్ పైన హై ఎలర్ట్ నేపధ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష చేశారు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పల్మనలజిస్ట్ అందరినీ అందుబాటులో ఉండేలా చూడాలని, అన్ని టీచింగ్ హాస్పిటల్స్‌లో కరోనా వైరస్ అనుమానితులు వస్తే చికిత్స చేయడం కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఈటెల రాజేందర్.
 
సోమవారం నుంచి గాంధీ మెడికల్ కాలేజ్‌లో కరోనా వైరస్ పరీక్షలు చేస్తారని, ప్రతి రోజు 30 మందికి పరీక్షలు చేయడానికి కిట్ అందుబాటులో వుంటుంది. ఒక పరీక్షకు 10 గంటల సమయం పడుతుంది. ఇప్పటివరకు తెలంగాణలో ఒక్క కేసు కూడా పాజిటివ్‌గా నమోదు కాలేదు. చైనా నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ ఫీవర్, గాంధీ, చెస్ట్ ఆసుపత్రులను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నాము అన్నారు ఈటెల.
 
ఆసుపత్రుల్లో చేరినవారికి చికిత్స అందించేందుకు అన్నివసతులు ఏర్పాటు చేశాము, మాస్క్‌లు, సానిటైజర్లు, సరిపోయేంతమంది సిబ్బందిని సిద్దంగా ఉంచాము. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలను ఖచ్చితంగా అమలుచేస్తున్నాము.
 
ఎంత ఎమర్జెన్సీ వచ్చినా వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ పూర్తి స్థాయిలో సిద్దంగా ఉంది. ప్రతి గంటకు పర్యవేక్షణ చేస్తున్నాము. ప్రజలు ఎంతమాత్రం భయపడవద్దు అని విలేకరుల సమావేశంలో తెలియచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments