Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో దోస్త్ గడువు పెంపు

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (13:09 IST)
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్)లో రిజిస్ట్రేషన్ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
నిజానికి ఈ గడువు గురువారంతో ముగియనుండగా, తాజాగా ఈ నెల 24వ తేదీకి పొడిగించారు. గురువారం మధ్యాహ్నం వరకు 1,40,581 మంది విద్యార్థులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 
 
ఈసారి ఇంటర్‌లో 4.73 లక్షల మంది ఉత్తీర్ణులు అయినా రిజిస్ట్రేషన్లు బాగా తగ్గాయి. కరోనా, వర్షాలు, విద్యుత్ అంతరాయాలు తదితర కారణాల వల్ల రిజిస్ట్రేషన్లు తగ్గాయని భావిస్తున్న అధికారులు గడువును ఈ నెల 24 వరకు పొడిగించారు. 31 నుంచి సీట్లు కేటాయిస్తారు.
 
అనంతరం ఆగస్టు 1వ తేదీ నుంచి 9 వరకు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. విద్యార్థులు 2వ తేదీ నుంచి 9 వరకు వెబ్ అప్లికేషన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు తెలిపారు. 
 
స్పెషల్ కేటగిరీ (దివ్యాంగులు, ఆర్మీ పిల్లలు, ఎన్‌సీసీ తదితర) విద్యార్థులు ఆగస్టు 6న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తిచేయించుకోవాలని, ఆగస్టు 14 నుంచి రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mega 158: మెగాస్టార్ చిరంజీవి.. మెగా158 రిలీజ్ డేట్ మారనుందా?

Irumudi Review: రవితేజ కట్టుకున్న ఇరుముడి కోరికలు తీర్చిందా.? లేదా? ఇరుముడి రివ్యూ

ధనుష్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే ఉంటాను : జీవీ ప్రకాష్

The Red Bag' Movie Review: మాతృప్రేమ,స్త్రీ శక్తిని చాటే చిత్రంగా ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ:

Allari Naresh: రంభ ఊర్వశి మేనక నుంచి బ్యాడ్ టైం బ్యాండ్ బాజా సాంగ్

తర్వాతి కథనం
Show comments