Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రాలు చేస్తున్నాడనే నిందలు... ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మ‌హ‌త్య‌

తెలంగాణ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ దారుణం వివరాలను పరిశీలిస్తే... కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన కొమరయ్య (

Webdunia
సోమవారం, 10 జులై 2017 (12:06 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ దారుణం వివరాలను పరిశీలిస్తే... కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన కొమరయ్య (36), కొమరమ్మ (32) అనే దంపతులు ఉన్నారు. వీరికి ఎల్లమ్మ (10), కోమల (6), అంజలి( 3) అనే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.
 
అయితే, కొమరయ్య క్షుద్రపూజలతో పాటు.. మంత్రాలు తంత్రాలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు గ్రామస్థులకు కొమరయ్యకు మధ్య గొడవలు జరుగగా, వారిలో కొందరు ఆయనపై భౌతికంగా దాడి చేశారు. దీనికితోడు.. కులపెద్దలు కొమరయ్య కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసింది.
 
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కొమరయ్యతో పాటు ఆయన భార్య కొమరమ్మ తమ పిల్లలకు ముందు ఉరివేసి ఆ తర్వాత తాము ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్ప‌డ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కులం సభ్యులతోపాటు స్థానికులే ఈ ఆత్మహత్యల‌కు కార‌కులంటూ ప్రచారం జ‌రుగుతోంది. గ్రామానికి చేరుకున్న పోలీసులు కుల బ‌హిష్క‌ర‌ణ చేసిన పెద్ద‌ల‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తుచేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments