Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరుకు జెంట్స్ బ్యూటీ పార్లర్.. జరిగేది మాత్రం.. సీసీ కెమెరాల తోడు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ లోని ఎస్సార్‌ నగర్‌ పరిధిలో బ్యూటీపార్లర్‌ పేరుతో నిర్వహిస్తున్న పేకాట స్థావరం గుట్టురట్టయింది. స్థానిక ధరంకరం రోడ్డులో ఉన్న పురుషుల బ్యూటీ పార్లర్ పై బుధవారం సాయంత్రం ఎస్సా

Webdunia
గురువారం, 27 జులై 2017 (02:00 IST)
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ లోని ఎస్సార్‌ నగర్‌ పరిధిలో బ్యూటీపార్లర్‌ పేరుతో నిర్వహిస్తున్న పేకాట స్థావరం గుట్టురట్టయింది. స్థానిక ధరంకరం రోడ్డులో ఉన్న పురుషుల బ్యూటీ పార్లర్ పై బుధవారం సాయంత్రం ఎస్సార్ నగర్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా నివ్వెరపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. ఈ పార్లర్‌లో ఒక రహస్య గదిని ఏర్పాటు చేసి పేకాట ఆడుతున్నారు.
 
బ్యూటీ పార్లల్‌పై దాడి చేసిన  పోలీసులను గమనించి ఇద్దరు పేకాట రాయుళ్లు జారుకోగా నలుగురు పట్టుబడ్డారు. వారివద్ద కొంతమొత్తంలో నగదు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. కాగా, పార్లర్‌లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసుకున్న నిర్వాహకుడు ప్రసాద్‌.. వాటిని తన సెల్‌ఫోన్‌కు కనెక్ట్‌ చేశాడు. దీంతో అపరిచితులు, పోలీసులు ఎవరైనా లోపలికి వచ్చిన వెంటనే తెలిసిపోతుంది.
 
పోలీసులకే మస్కా కొట్టడానికి ఈ ప్యార్లర్లూ, పబ్‌లూ, క్లబ్‌లూ చేస్తున్న రకరకాల నాటకాలు చూస్తుంటే వీళ్లపై చర్యలు తీసుకోవడానికి డోస్ పెంచాల్సిన అవసరముందనిపిస్తోంది.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments