Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగం కావాలంటే ఓయో రూమ్‌కు రా... అక్కడే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తా...

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (12:32 IST)
హైదరాబాద్ నగరంలో మహిళలు వేధింపులకు గురవుతున్న సంఘటనలు హెచ్చుమీరిపోతున్నాయి. తాజాగా ఓ నిరుద్యోగ యువతిని ఓ ఉద్యోగి లైంగికవాంఛ తీర్చాలంటూ వేధించాడు. ఉద్యోగం కావాలంటే ఓయో గదికి వచ్చి తన కోర్కె తీర్చాలంటూ అసభ్యంగా మెసేజ్ పెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్‌కు చెందిన యువతి(28) వారం క్రితం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లోని ఓ ఇమ్మిగ్రేషన్‌ సంస్థలో ఉద్యోగం ఇంటర్వ్యూకు వెళ్లింది. ఈ కార్యాలయంలో పనిచేసే అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ సుమంత్‌ అనే ఉద్యోగితో ఆమెకు పరిచయమైంది. దీంతో వారిద్దరూ చాటింగ్‌లో మాట్లాడుకోసాగారు. 
 
ఈ క్రమంలో ఉద్యోగం కావాలంటే.. ఓయో రూమ్‌ బుక్‌ చేశానని ఉద్యోగం అక్కడే ఇస్తానంటూ చెప్పాడు. ఆందోళన చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు ఇమ్మిగ్రేషన్‌ సెంటర్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ సుమంత్‌పై పోలీసులు ఐపీసీ 509 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments