Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు చెడింది కాకుండా.. చెల్లెల్లి చెడగొడతావా? తల్లిని చంపేసిన కుమారుడు..!

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (09:46 IST)
కన్నకూతురిని పెడదారిన పెట్టేందుకు ప్రయత్నించిన తల్లిని సొంత కొడుకే హతమార్చిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ఎల్లమ్మ బండకు చెందిన సురేష్‌ ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 
 
తల్లిదండ్రులు, చెల్లెలు, భార్యతో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అయితే డబ్బుల సంపాధన కోసం సురేష్‌ తల్లి మల్లమ్మ (40) తప్పుడు మార్గాలను ఎంచుకుంది. ఈ క్రమంలో ఆమె భర్త మద్యానికి బానిసగా మారాడు. ఇందు కోసం అతను భిక్షటన చేస్తున్నాడు. 
 
ఈ క్రమంలో డబ్బులు బాగా సంపాదించాలనే ఆశతో మల్లమ్మ తన మైనర్‌ కుమార్తెను కూడా తను ఉన్న ఆ చెడు మార్గంలోకి తీసుకెళ్లాలని ప్లాన్ వేయడం ప్రారంభించింది. ఈ విషయం సురేష్‌కు తెలియడంతో అతను తల్లిపై అనేక సార్లు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయినా ఆమె తన పద్ధతి మార్చుకోలేదు. 
 
ఈ వ్యవహారం కాస్త పెద్ద గొడవకు దారితీసింది. దీంతో సురేష్ తీవ్ర ఆగ్రహానికి గురై చీర కొంగును మల్లమ్మ గొంతుకు బిగించి హత్య చేశాడు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments