హైదరాబాదులో భారీ వర్షం.. మరో రెండు రోజులు ఇంతే.. ఆరెంజ్ అలెర్ట్

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (09:39 IST)
హైదరాబాదులో వాతావరణం పూర్తిగా మారిపోయింది. వేసవితో అల్లాడిన ప్రజలను వరుణుడు పలకరించాడు. హైదరాబాదుతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం వర్షం దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ ఏర్పడింది. 
 
విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. నగరంలోని బంజారాహిల్స్, పంజాగుట్ట, హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. 
 
అంతేగాకుండా హైదరాబాదు నగరంలో మరో రెండు గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలంటూ హైదరాబాద్ వాతావరణశాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. అలాగే ఏపీలోనూ శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi : ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్ తో వచ్చారు : రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments