భార్య కాపురానికి రావడం లేదనీ... మనస్తాపంతో భర్త...

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (08:37 IST)
హైదరాబాద్ నగరంలో ఓ భర్త బలవర్మణానికి పాల్పడ్డాడు. భార్య కాపురానికి రావట్లేదనే మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బంజారాహిల్స్‌ పోలీసు ఠాణా పరిధిలో జరిగింది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఫిలింనగర్‌లోని జగ్జీవన్‌రాం నగర్‌లో నివసించే విశ్వనాథ్‌(40)కు నవాబుపేట ప్రాంతానికి చెందిన సుమలతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లైన కొద్ది సంవత్సరాలకే ఇద్దరి మధ్యన తగాదాలు జరుగుతూ ఉండేవి. భార్యభర్తల గొడవ నేపథ్యంలో సుమలత తరచూ పుట్టింటికి వెళ్లిపోయేది.
 
ఈ క్రమంలో 2018లో జరిగిన గొడవ నేపథ్యంలో తన ఇద్దరు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. రావాలంటూ భర్త ఎన్నిసార్లు కోరినా అందుకు ఆమె అంగీకరించలేదు. మంగళవారం మరోసారి ఫోన్‌ చేసి రావాలని కోరినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన విశ్వనాథ్‌.. ఇంట్లోనే ఫ్యానుకు ఉరి పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
అతని తల్లి లింగమ్మ వెళ్లి చూసేటప్పటికే మృతి చెంది కనిపించాడు. గత నవంబరులోనూ ఇలానే భార్య రావట్లేదనే మనోవేదనతో సిలిండర్‌ గ్యాసు వదులుకొని ఆత్మహత్యాయత్నం చేసినట్లు లింగమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

MS Raju: అమ్మ వారి కథ తో అగధ, కనుక ఎల్లమ్మ–పోచమ్మ ఆశీస్సులతో ప్రచార జాతర

Rishab Shetty :స్పైడర్-మ్యాన్ పాత్ర నాకు ఎంతో నేర్పింది : రిషబ్ శెట్టి

Ram Charan surgery :డాక్టర్ రాజశేఖర్ పర్యవేక్షణలో నేడు రామ్ చరణ్ కు మణికట్టు సర్జరీ

Nani: ఆయా షేర్ సాంగ్ క్రేజ్ తో రికార్డ్ స్థాయిలో బిజిసెస్ అయిన ది ప్యారడైజ్

గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి ఆర్థికసాయం

తర్వాతి కథనం
Show comments