Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అశ్లీల చాటింగ్ చేయాలి... ఫోన్ చేసినపుడు మాట్లాడాలి'.. టీఆర్ఎస్ కార్పొరేటర్ సన్ వేధింపులు

'నాతో నీవు అశ్లీల చాటింగ్స్‌ చేయాలి. నేను కాల్‌ చేసినప్పుడు ఫోన్‌ మాట్లాడాలి. ఫోన్ పెట్టావంటే మార్ఫింగ్‌ చేసిన నీ ఫొటోలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తా'నంటూ హైదరాబాద్ నగరంలో అధికార తెరాసకు చెందిన కార్ప

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (14:34 IST)
'నాతో నీవు అశ్లీల చాటింగ్స్‌ చేయాలి. నేను కాల్‌ చేసినప్పుడు ఫోన్‌ మాట్లాడాలి. ఫోన్ పెట్టావంటే మార్ఫింగ్‌ చేసిన నీ ఫొటోలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తా'నంటూ హైదరాబాద్ నగరంలో అధికార తెరాసకు చెందిన కార్పొరేటర్ తనయుడు చేసిన బెదిరింపులు, వేధింపులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి బెదిరింపులు ఒకరికి ఇద్దరికీ కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో యువతులకు వెళ్ళాయి. దీంతో ముగ్గురు బాధితురాళ్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన షీ టీమ్స్ తెరాస కార్పొరేటర్‌ తనయుడిని అరెస్టు చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మల్కాజ్‌గిరి కార్పొరేటర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌ కుమారుడు అభిషేక్‌ గౌడ్‌. అభిషేక్‌ తాను చదివిన స్కూల్‌లో కొన్నేళ్ల క్రితం చదివిన విద్యార్థినుల వివరాలను ఫేస్‌బుక్‌ ద్వారా సేకరించాడు. తానూ అదే స్కూల్‌లో చదివిన యువతిగా పరిచయం చేసుకుంటూ ఖాతా తెరిచాడు. అప్పటికే స్కూల్‌ పూర్వ విద్యార్థుల వివరాలు అతడికి తెలిసి ఉండటంతో వారందరికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపాడు. 
 
అనంతరం వారి ఫోన్‌ నెంబర్లు ఇతర వివరాలు సేకరించిన అభిషేక్‌ ఆ తర్వాత అసలు కథ ప్రారంభించాడు. పోలీసులకు ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు ఇంటర్‌నెట్‌ కాలింగ్‌ను వినియోగించాడు. గత పక్షం రోజులుగా ఒక్కో యువతికి కాల్‌ చేస్తూ చెప్పలేని విధంగా వేధించసాగాడు. ‘నాతో నీవు అశ్లీల చాటింగ్స్‌ చేయాలి. నేను కాల్‌ చేసినప్పుడు ఫోన్‌ పెట్టావంటే మార్ఫింగ్‌ చేసిన నీ ఫొటోలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తానని బెదిరించేవాడు. 
 
ఇలా గత 15 రోజులుగా పలువురు యువతులకు నరకం చూపించాడు. దీంతో పలువురు బాధితురాళ్ల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా నిందితుడిని పట్టుకోవాలని ప్రయత్నించారు. అయితే దాని చిరునామా ఒకచోట, లోకేషన్స్‌ మరోచోట రావడంతో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. రెండు రోజులుగా వివిధ ప్రాంతాల నుంచి యువతులను వేధిస్తున్నట్లు గుర్తించారు. చివరకు మల్కాజిగిరిలో మంగళవారం రాత్రి అతడిని పట్టుకున్నారు.
 
దీనిపై సైబరాబాద్‌ ఏసీపీ మాట్లాడుతూ... అభిషేక్‌ ఆగడాలపై ముగ్గురు యువతులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అతడు సోషల్‌మీడియాలో యువతుల ఫోటోలను మార్ఫింగ్‌ చేసి అప్‌లోడ్‌ చేసినట్లు వెల్లడించారు. అభిషేక్‌పై ఐపీసీ సెక్షన్ 67(ఏ), ఐటీ యాక్ట్‌ 354 (డీ) కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ పేర్కొన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments