తెలంగాణలో రైతు మృతి-వడ్ల కుప్పపైనే నేలకూలిపోయాడు

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (22:48 IST)
తెలంగాణలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. వడ్ల కుప్పపై కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం రైతుల పాలిట శాపంగా మారుతోంది. ఇటీవలే జిల్లాలోని లింగంపేట మండలం ఐలాపూర్​కు చెందిన రైతు బీరయ్య వడ్ల కుప్పపైనే చనిపోయిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా రోజుల తరబడి ఐకేపీ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్న రైతన్నలు గుండెపగిలి వడ్ల కుప్పలపైనే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తీవ్ర విషాదం నింపుతున్నాయి
 
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్​ ఎల్లారెడ్డిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అడ్లూర్​ఎల్లారెడ్డికి చెందిన రైతు కుమ్మరి రాజయ్య(55)  పది రోజుల క్రితం తన వడ్లను స్థానిక కొనుగోలు సెంటర్​కు తీసుకొచ్చారు. అప్పటి నుంచి అక్కడే కావలి ఉంటున్నారు. 
 
గురువారం సాయంత్రం రాజయ్య కుప్ప వద్ద కావలి ఉండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. గుండెలో నొప్పి వస్తున్నదని, చెమటలు పడుతున్నయని మిగతా రైతులకు చెప్పాడు. వాళ్లు వెంటనే కామారెడ్డి జిల్లా దవాఖానకు తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు రాజయ్య అప్పటికే గుండె పోటుతో చనిపోయాడని తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖుష్బూ కుమార్తె పెళ్లికి త్రిష, ఖాళీగా పక్కసీటు, అది ఎవరికోసం?

Sree Vishnu: ఫస్ట్ 25 టికెట్స్ ఎవరు కొంటే వారికి మరొక టికెట్ ఫ్రీ ఇస్తాం :శ్రీవిష్ణు

Kajal Aggarwal :పురుగు మందుల పేరుతో జరిగే అన్యాయాలపై లాయర్ పోరాటమే ది ఇండియా స్టోరీ

Aishwarya Rajesh :ఇసకపట్నం పై ఆధిపత్యం చేసే సముద్రఖని కి సవాల్ గా మారిన ఐశ్వర్య రాజేష్

Tatvam trailer: మర్డర్ మిస్టరీ, ఇన్వస్టిగేషన్‌ థ్రిల్లర్‌ గా తత్వం ట్రైలర్‌

తర్వాతి కథనం
Show comments