Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియల్ ఎస్టేట్ పైనే కేసీఆర్ దృష్టి: బీజేపీ

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (07:57 IST)
సీఎం కేసీఆర్ కు యాదాద్రి అభివృద్ధి కంటే.. యాదాద్రిలో రియల్ ఎస్టేట్ పైనే దృష్టి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. యాదాద్రి పవిత్రతకు కేసీఆర్ మచ్చ తెస్తున్నారన్నారు.

భక్తుల మనోభావాలను తెరాస నేతలు దెబ్బతీస్తున్నారన్నారు. కేసీఆర్ సొంత గ్రామం చింతమడక అభివృద్ధికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది.. రాష్ట్రం ఇచ్చిన నిధులెన్నో చెప్పాలన్నారు. కేసీఆర్ వైఖరి దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. యాదాద్రిలో అపచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కాషాయం ధరించి పూజలు, పునస్కారాలు చేస్తే హిందువు అయిపోరని చెప్పారు. హైందవ ధర్మానికి ముఖ్యమంత్రి ముప్పుగా మారారని వ్యాఖ్యానించారు. సాక్షాత్తు ముఖ్తమంత్రే ఆయన శిల్పాలు చెక్కించుకున్నారని గుర్తుచేశారు.

స్వామి కంటే ముందు ఆయన్నే భక్తులు దర్శించుకునేందుకు సీఎం కుట్ర చేసినట్లు వెల్లడించారు. మూల విరాట్‌ను ఉలితో చెక్కడం మహా పాపంగా అభివర్ణించారు. తెలంగాణ కొంగు బంగారం యాదాద్రిని ఏం చేయాలనుకుంటున్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్.. యాదాద్రి ఆలయాన్ని అడ్డంపెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. 2 వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయ ప్రతిష్టను సీఎం దిగజారుస్తున్నారని మండిపడ్డారు. సినిమా ఆర్ట్ డైరెక్టర్‌ను పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు శిల్పాలు చెక్కించడం మంచి పద్ధతి కాదన్నారు. అలాగే పత్రికల మీద ఆంక్షలు సరైంది కాదని హితవు పలికారు.

కేంద్రం ఇచ్చే నిధుల మీదనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడి నడుస్తోందన్నారు. కేటీఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉన్నాయన్నారు. కేటీఆర్‌కు సవాల్ చేస్తున్నా... కేంద్ర నిధులపై బహిరంగ చర్చకు రావాలని లక్ష్మణ్ సవాల్ విసిరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments