Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల కోసం దేశంలోనే మొదటిది అంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్

"సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం అత్యంత దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వ్యవసాయ రంగం కుదుటపడుతున్నది. రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఏదైనా కారణం వల్ల రైతు మరణిస్తే ఆ కుటుంబం ద

Webdunia
బుధవారం, 16 మే 2018 (14:58 IST)
"సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం అత్యంత దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల వ్యవసాయ రంగం కుదుటపడుతున్నది. రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఏదైనా కారణం వల్ల రైతు మరణిస్తే ఆ కుటుంబం దిక్కులేనిది కావద్దనే ఉద్దేశంతోని బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించాం. చిన్నకారు, సన్నకారు, పెద్దరైతు అనే తేడా లేకుండా బీమా సౌకర్యం రైతులందరికీ వర్తింపచేయాలి. ఇందుకోసం రైతులందరూ సభ్యులుగా గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించాలి" అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

మరణించిన రైతుల కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం యావత్తు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. రైతులకు బీమా సౌకర్యం కల్పించే అంశంపై ప్రగతిభవన్‌లో మంగళవారం సిఎం సమీక్ష నిర్వహించారు. మరణించిన రైతు కుటుంబాలకు బీమా కల్పించే విషయంలో ఇన్సురెన్స్ కంపెనీలతో మాట్లాడి విధివిదానాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
 
పథకం ఎలా అమలు చేయాలనే విషయంపై అధికారులు, బీమా సంస్థల ప్రతినిధులతో విపులంగా చర్చించారు. రైతుల తరుపున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దీని కోసం బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తామని చెప్పారు. రైతుల బీమా పథకం దేశంలోనే మొదటిది కావడంతో పాటు రైతులలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది అని ముఖ్యమంత్రి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments