Webdunia - Bharat's app for daily news and videos

Install App

బయోపిక్‌లపై మాకు అభ్యంతరం లేదు... బాబు బయోపిక్ రెడీ...

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (15:53 IST)
ఎన్నికల కోడ్ అమలైతే రాజకీయ నాయకులపై తీసే బయోపిక్‌ల విడుదలపై ఇప్పటివరకు అనేక అనుమానాలున్నాయి. కోడ్ సమయంలో బయోపిక్‌లను విడుదల చేయకూడదంటూ కొందరు వాదిస్తుండటంతో మరికొందరు ఆ వ్యాఖ్యలతో విభేదిస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఈ సందేహాలకు తెరదించారు.
 
ఈరోజు మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు రాజకీయ నాయకుల బయోపిక్ సినిమాల విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా అటువంటి ఫిర్యాదులు చేస్తే తప్పకుండా వాటిని పరిశీలిస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో రజత్ కుమార్ పలు అంశాలపై మాట్లాడారు.
 
ఈవీఎంలపై ప్రజలకు ఎటువంటి సందేహాలు అవసరం లేదని, వాటిని పూర్తిగా పరిశీలించి ఒకట్రెండు సార్లు మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాతే వాటిని పోలింగ్ బూత్‌లలో ఉంచుతామన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికలను ఈసీ సరైన సమయానికే ప్రకటించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులపై, వారి సోషల్ మీడియా మరియు ఆర్థిక లావాదేవీలపై నిరంతర నిఘా ఉంటుందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments