Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్.ఆర్.ఐ భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య..

Webdunia
బుధవారం, 8 మే 2019 (12:45 IST)
హైదరాబాద్ రామాంతపూర్‌కు చెందిన జువాడి శ్రీలత అదనపు కట్నం వేధింపులు భరించలేక ముంబయిలోని తన మేనమామ ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె బంధువులు తెలిపిన వివరాల ప్రకారం 2012లో వంశీరావుతో శ్రీలతకు వివాహం జరిగింది. వెంటనే భర్తతో కలిసి లండన్‌ వెళ్లిపోయిన శ్రీలత కాపురం సాఫీగానే సాగింది. శ్రీలత తల్లి చనిపోవడం, 2016 శ్రీలత గర్భవతి కావడంతో ఆమెకు తోడుగా ఉండటం కోసం అత్త ఆశాలత లండన్‌ వెళ్లింది.
 
అక్కడ పాపకు జన్మనిచ్చిన శ్రీలతకు భర్త, అత్త నుంచి వేధింపులు ఎక్కువ అయ్యాయి. దీంతో 2018 ఫిబ్రవరిలో లండన్‌లోనే శ్రీలత ఒకసారి రైలుకింద పడి ఆత్మహత్యాయత్నం చేసినట్టు చెబుతున్నారు ఆమె బంధువులు. గత సంవత్సరం జూన్‌లో అంతా కలిసి హైదరాబాద్‌ వచ్చినా శ్రీలతను, పాపను రామంతాపూర్‌లోనే వదిలి వంశీరావు ఒక్కడే తిరిగి లండన్‌ వెళ్లిపోయాడు. అయితే గత 10 నెలలుగా శ్రీలత అత్తమామలు దగ్గర ఉండటంతో వారి వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేక ముంబయిలోని మేనమామ ఇంటికి వెళ్లి అక్కడ ఆత్మహత్య చేసుకుంది. 
 
శ్రీలత మృతదేహాన్ని ముంబయి నుంచి మంగళవారం రాత్రి రామాంతపూర్ లోని అత్తమామల ఇంటికి తీసుకువచ్చారు. విషయం తెలిసి అత్తమామలు ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడంతో మృతదేహాన్ని ఇంటి ముందు ఉంచారు. ఆత్మహత్యకు కారణమైన భర్త, అత్తమామలను శిక్షించే వరకూ న్యాయపోరాటం చేస్తామని భర్త ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నారు బంధువులు. శ్రీలతకు భర్త, అత్తమామలు పెట్టే వేధింపులు భరించలేకే శ్రీలత తల్లి మానసిన వేధన అనుభవించి చనిపోయిందని వాపోతున్నారు మృతురాలు బంధువులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం