తెలంగాణ వాసులకు అది తీరని లోటు.. పవన్ కల్యాణ్

Webdunia
గురువారం, 22 అక్టోబరు 2020 (13:44 IST)
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తపించిన నిబద్ధత కలిగిన ఉద్యమకారుడని నాయినిని పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. తెలంగాణ ఉద్యమం తొలి, మలి దశలలో ఆయన గణనీయమైన పాత్ర ఎన్నటికీ మరువలేమని పవన్ పేర్కొన్నారు. కార్మిక నాయకుడు, తెలంగాణవాది, మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి మరణం కార్మిక వర్గానికి, తెలంగాణ వాసులకు తీరని లోటు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
 
కార్మిక నాయకునిగా రాజకీయ జీవితం ప్రారంభించి మూడుసార్లు ఎమ్మెల్యేగా.. ఒక పర్యాయం ఎమ్మెల్సీగా ప్రజలకు అమూల్యమైన సేవలు అందించారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, తెలంగాణ ఆవిర్భావం తరువాత మంత్రిగా ఆయన పని చేసి ప్రజలకు సేవలందించారన్నారు. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. నరసింహారెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని పవన్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 ఏళ్ల వయసులో ఆమీర్ ఖాన్ 3వ పెళ్లి, ఏడాదిన్నరగా ఆమెతో డేటింగ్ చేసి...

సమంత తల్లి కాబోతుందా.. బేబీ బంప్‌తో కనిపించిన మా ఇంటి బంగారం? (video)

Klin Kaara: క్లిన్ కారాతో హ్యాపీగా కనిపించిన ఉపాసన, రామ్ చరణ్

Allu Arjun Court: అల్లు అర్జున్ తప్పనిసరిగా హాజరు కావాలన్న నాంపల్లి కోర్టు

Vishal : మకుటం నుంచి విశాల్ పాడిన రైజ్ ఆఫ్ లింగా పాట

తర్వాతి కథనం
Show comments