Webdunia - Bharat's app for daily news and videos

Install App

బార్లలో వన్ ప్లస్ వన్ ఆఫర్... ఒక్కరోజే రూ.350 కోట్ల మద్యం సేల్స్

తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులు తెగ తాగి పండుగ చేసుకున్నారు. బార్లలో వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్ర అబ్కారీ శాఖకు ఒక్కరోజే కోట్లాది రూపాయల ఆదాయం వచ్చింది.

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2017 (11:02 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులు తెగ తాగి పండుగ చేసుకున్నారు. బార్లలో వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించారు. దీంతో ఆ రాష్ట్ర అబ్కారీ శాఖకు ఒక్కరోజే కోట్లాది రూపాయల ఆదాయం వచ్చింది. ఒక్క పండుగ పూటరోజే ఏకంగా రూ.350 కోట్ల విలువ చేసే మద్యాన్ని సేవించారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రూ.100 కోట్ల మేరకు విక్రయాలు జరిగాయి. అంతేనా.. చుక్కతో పాటు ముక్క కూడా తిన్నారు. ఫలితంగా దసర పండుగ రోజున మాంసం విక్రయాలు కూడా టాప్ గేర్‌లో సాగాయి. 
 
దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలో భారీ ఎత్తున మద్యం వ్యాపారం జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. దసరా పండుగ రోజు ఏకంగా 5.5 లక్షల కేసులు విక్రయించినట్టు తెలిపారు. ఇందులో 3 లక్షల ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎంఎల్) కాగా, 2.5 లక్షల బీర్ల కేసులు కూడా ఉన్నాయి.
 
అక్టోబరు ఒకటో తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీ అమల్లోకి రానుండడంతో పాత స్టాకును వదిలించుకోవడమే లక్ష్యంగా డీలర్లు విక్రయాలు సాగించారు. దీంతో చివరి మూడు రోజుల్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. బార్లలో వన్ ప్లస్ వన్‌లాంటి ఆఫర్లు కూడా ప్రకటించారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే రూ.వంద కోట్ల వ్యాపారం జరగ్గా గ్రామీణ ప్రాంతాల్లో రూ.250 కోట్ల విక్రయాలు జరిగాయి. 
 
మరోవైపు దసరా అంటేనే చుక్క-ముక్క అని భావించడంతో మాంసం విక్రయాలు కూడా ఎన్నడూ లేనంతగా సాగాయి. సికింద్రాబాద్, జియాగూడ, చెంగిచెర్ల తదితర హోల్‌సేల్ మాంసం మార్కెట్లలో శని, ఆదివారాల్లో రూ.30 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్టు అంచనా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments