Daily Horoscope
✕

ఆకాశానికి చిల్లు - 24 గంటల్లో 26.77 మి.మీ వర్షపాతం.. ఎక్కడ?

Webdunia
గురువారం, 15 జులై 2021 (14:41 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా వర్షం కురిసింది. గత 24 గంటల్లో భారీ వర్షం పడింది. ఫలితంగా రికార్డు స్థాయిలో 26.77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, రాబోయే రెండు, మూడు రోజుల్లో కూడా విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. 
 
గత 24 గంటల్లో కురిసిన వర్షపాతం సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే మూడు రెట్లు అధికంగా ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. సాధార‌ణ వ‌ర్ష‌పాతం 9.9 మి.మీ. మాత్ర‌మే. బుధ‌వారం కురిసిన వ‌ర్షానికి 20 మండ‌లాల్లో 100 మి.మీ. కంటే ఎక్కువ‌గా వ‌ర్ష‌పాతం న‌మోదైంది.
 
గురువారం ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు మెద‌క్ జిల్లాలోని చేగుంట‌లో అత్య‌ధికంగా 227.5 మి.మీ. వ‌ర్ష‌పాతం, రంగారెడ్డి జిల్లాలోని త‌ట్టి అన్నారంలో 216 మి.మీ., నాగోల్ ప‌రిధిలోని బండ్లగూడ‌లో 212.7 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. 
 
ఈ మూడు ప్రాంతాల్లో అతి భారీ వ‌ర్షం కురిసిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. మ‌రో 13 ఏరియాల్లో భారీ వ‌ర్షం కురవ‌గా, 142 మి.మీ. నుంచి 192 మి.మీ. మ‌ధ్య వ‌ర్ష‌పాతం న‌మోదైంది.
 
ఇకపోతే, జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ మ‌ధ్య రాష్ట్రంలో 369.7 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదు కాగా, ఈ స‌మ‌యంలో సాధార‌ణ వ‌ర్ష‌పాతం 236.33 మి.మీ. మాత్ర‌మే. 17 జిల్లాల్లో రికార్డు స్థాయిలో 60 శాతం కంటే ఎక్కువ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. మ‌రో 13 జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వ‌ర‌కు వ‌ర్షపాతం న‌మోదైంది. మూడు జిల్లాల్లో మాత్రం సాధారణంగానే నమోదైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

G.V. Prakash Kumar :ఆకాశంలో ఒక తార చిత్రానికి నేషనల్ అవార్డ్స్ వస్తుందని నమ్ముతున్నా : జీవీ ప్రకాశ్ కుమార్

సీఐఐ భాగస్వామ్య సదస్సులో 36.24 కోట్ల ఎంవోయూ కుదుర్చుకున్న నమస్తే వరల్డ్

Dil Raju: నేను ఎప్పుడూ ఫెయిల్యూర్స్‌కు కుంగిపోను, సక్సెస్‌కు పొంగిపోను : దిల్ రాజు

Maya Lady review :సరదాగా సాగిన రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ ల మాయలేడీ రివ్యూ

NTR, Trivikram rumors: ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కళ్యాణ్ రామ్ ఫొటోలతో పుకార్లకు ఫుల్ స్టాప్

తర్వాతి కథనం
Show comments