Daily Horoscope
✕

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీల దుర్మరణం

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (10:21 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మిరపకాయల కోతకు వెళుతున్న ముగ్గురు కూలీలు మృత్యువాతపడ్డారు. మరో 15 మంది గాయపడ్డారు. వీరంతా బాధితులే కావడం గమనార్హం. 
 
మిరపకాయల కోత కోసం పత్తిపాకకు చెందిన చెందిన కొందరు కూలీలు ఒక ఆటోలో వెళుతున్నారు. ఈ ఆటోను మాందారిపేట వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 
మృతులను మంజుల (45), రేణుక (48), విమర (50)గా గుర్తించారు. క్షతగాత్రులను వరంగల్ జిల్లా ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR, Trivikram rumors: ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కళ్యాణ్ రామ్ ఫొటోలతో పుకార్లకు ఫుల్ స్టాప్

Ram Charan’s visit Shirdi :RC17 ప్రీ-ప్రొడక్షన్ సందడి మధ్య షిర్డీ ఆలయ సందర్శన

రామ్ చరణ్ నటించిన సినిమాల్లో మీకు నచ్చినది ఏది? నారా లోకేష్ ప్రశ్న.. ఉపాసన సమాధానం?

రామాయణం సెట్స్‌లో సాయిపల్లవి కన్నీళ్లు.. ఎందుకో తెలుసా?

ప్రెగ్నెంట్ అయితేనేంటి? సినిమాలకు గుడ్ బై చెప్పేది లేదు.. టాక్సిక్ కుంగదీసింది..

తర్వాతి కథనం
Show comments