నేటి నుండి ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు ప్రారంభం

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (15:12 IST)
లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు నేటి రాత్రి నుంచి రాకపోకలను ప్రారంభించనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఇదే తరుణంలో కడప, కర్నూలు, చిత్తూరు, రాజ మండ్రి, విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు వెళ్లే బస్సులను సిద్దం చేయాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం.
 
ఈ మధ్యాహ్నం ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య  ఒప్పందంపై సంతకం జరిగిన మరుక్షణమే అన్ని రకాల బస్సులను డిపో నుంచి బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 1.61 లక్ష కిలోమీటర్లు తగ్గించుకునేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సిద్దపడిన విషయం తెలిసిందే.
 
ఇక సోమవారం రాత్రికే బస్సులను నడపనున్నామని తెలిపారు. ఈ మేరకు డిపో మేనేజర్లకు సమాచారాన్ని పంపించామని అన్నారు. బస్సులు నడవడం ప్రారంభం అయిన వెంటనే ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎస్ ఎస్ రాజమౌళి వారణాసి షెడ్యూల్ అంటార్కిటికాలో - తాజా అప్ డేట్

Peddi sekaṇḍ siṅgil: పెద్ది సెకండ్ సింగిల్ రై రై రారా.. అంటూ రామ్ చరణ్ గ్రేస్ పెంచాడా !

Rashmika: సొంత ఊరు తుమ్మన్ పేటలో పెళ్లి వేడుకలు జరుపుకున్న విజయ్ దేవరకొండ

Laya: సాంప్రదాయబద్ధంగా జీవించే శివాజీ, లయ వాటిని బ్రేక్ చేస్తే?

Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పై ల‌వ్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తెలంగాణలో అపోలో ఫార్మసీ 1000 స్టోర్ల మైలురాయి: హైదరాబాద్‌లో ఇ-స్టోర్‌ను ప్రారంభించిన ఉపాసన

అధునాతన మధుమేహ నిర్వహణ కోసం నోవో నార్డిస్క్ ఇండియాతో అబాట్ భాగస్వామ్యం

నిద్రలేమి ఎన్నో ఇబ్బందులు.. ఆరోగ్యానికి చేటు.. అమెరికా వైద్యులు

తర్వాతి కథనం
Show comments