Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవి తాపం.. బీర్లు తెగ తాగేస్తున్న హైదరాబాదీయులు

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2023 (09:08 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో యువత ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు బీర్లు తెగ తాగేస్తున్నారు. నగరంలో ప్రతి నిత్యం సగటున 6 లక్షల బీర్ల అమ్మకాలు సాగుతున్నాయి. ఈ కారణంగా గత 17 రోజుల్లో కోటి బీర్లు అమ్ముడుపోయాయి. 
 
ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం గ్రేటర్‌ హైదరాబాద్ నగర పరిధిలోని మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 8,46,175 కేస్‌ల (ఒక కేస్‌లో 12 బీర్లు ఉంటాయి) బీర్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలో సగటున 10 శాతం చొప్పున విక్రయాలు పెరిగాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రికార్డుస్థాయిలో విక్రయాలు నమోదవుతున్నాయి. 
 
నెలకు సగటున లక్ష చొప్పున బీరు కేసుల విక్రయాలు అధికంగా నమోదు కావడం గమనార్హం. సాధారణంగా విస్కీ, బ్రాంది తదితర అలవాటున్న వ్యక్తులు సైతం ఎండల ప్రతాపంతో బీరు వైపు చూస్తున్నారు. ఆబ్కారీ శాఖ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌లో గ్రేటర్‌ పరిధిలోని మూడు జిల్లాల్లో రోజూ సగటున 6 లక్షల బీర్లు అమ్ముడవుతున్నాయి.
 
గత జనవరి నెలలో హైదరాబాద్ నగరంలో 296619 బీర్లు, రంగారెడ్డిలో 836907, మేడ్చల్‌లో 134468 బీర్లు చొప్పున తాగేశారు. అదే ఫిబ్రవరి నెలలో హైదరాబాద్‌లో 331784, రంగారెడ్డిలో 934452, మేడ్చల్‌లో 146763, మార్చి నెలలో 368569, రంగారెడ్డిలో 1077240, మేడ్చల్‌లో 163358, ఏప్రిల్ నెలలో 194351, రంగారెడ్డిలో 559745, మేడ్చల్‌లో 92078 చొప్పున బీర్లు తాగేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments