Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపురం చేసేందుకు రూ. 3 కోట్లు అడిగిందన్న భర్త, రూ.20 వేలు చెల్లించి ఇంట్లో వుండనివ్వండి...

బోడుప్పల్‌లో గత 53 రోజులుగా తనకు న్యాయం చేయాలంటూ తన భర్త శ్రీనివాస్ రెడ్డి ఇంటి ఎదుటే దీక్ష చేస్తున్న సంగీతకు కోర్టులో ఊరట లభించింది. ఆమె భర్తకు మియాపూర్‌ ఫ్యామిలీ కోర్టు అక్షింతలు వేస్తూ తీర్పునిచ్చింది. సంగీతకు ప్రతి నెల రూ. 20 వేలు చెల్లించడమే కాక

Webdunia
గురువారం, 11 జనవరి 2018 (17:37 IST)
బోడుప్పల్‌లో గత 53 రోజులుగా తనకు న్యాయం చేయాలంటూ తన భర్త శ్రీనివాస్ రెడ్డి ఇంటి ఎదుటే దీక్ష చేస్తున్న సంగీతకు కోర్టులో ఊరట లభించింది. ఆమె భర్తకు మియాపూర్‌ ఫ్యామిలీ కోర్టు అక్షింతలు వేస్తూ తీర్పునిచ్చింది. సంగీతకు ప్రతి నెల రూ. 20 వేలు చెల్లించడమే కాకుండా, ఆమెను గౌరవప్రదంగా ఇంట్లో వుండనివ్వాలని సూచన చేసింది. కాగా సంగీత ఇంతకుమునుపే కోర్టులో తన భర్త, అత్తమామలపై పిటీషన్ దాఖలు చేశారు. 
 
ఈ నేపధ్యంలో శ్రీనివాస్ రెడ్డి అరెస్టయి నిన్ననే బెయిల్ పైన బయటకు వచ్చాడు. తన భార్య తనతో కాపురం చేయాలంటే రూ. 3 కోట్లు డిమాండ్ చేస్తోందనీ, తన ఆస్తినంతా ఆమెకు రాయమంటోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను, తన తల్లిదండ్రులను వేధిస్తోందంటూ రివర్స్ ఎటాక్ చేశాడు. దీనిపై సంగీత మాట్లాడుతూ... అతడు చెప్పేవన్నీ అవాస్తవాలని పేర్కొన్నారు. తను 3 కోట్లు డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే తన కేసు వాపసు తీసుకుంటానని ఆమె వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments