Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండోసారి కోర్కె తీర్చనందుకు అడవిలోనే ఆంటీని అంతం చేశాడు

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (13:55 IST)
ఓ పెళ్లిలో 30 ఏళ్ల ఆంటీని చూశాడు. ఆమెను అనుభవించాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే ఆమెను అడవిలోకి తీసుకెళ్లి అనుభవించాడు. రెండోసారి కూడా తన కోర్కెను తీర్చాలన్నాడు. అందుకు ఆమె ససేమిరా అంది. అంతే.. తలను బండరాయికేసి బాది హతమార్చాడు. మెదక్ జిల్లాలో ఈ దారణం జరిగింది.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... హవేలి ఘనపూర్‌ మండలం తొగిటకు చెందిన మహేశ్‌ ఆగస్టు 16న తన ఫ్రెండ్‌ పెళ్లి కోసం పాపన్నపేట మండలం మల్లంపేట గ్రామానికి వచ్చాడు. పెళ్లిలో పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి నారాయణరెడ్డి కాలనీకి చెందిన 30 ఏళ్ల గ్యారంగుల సాలమ్మ అతడి కంట్లో పడింది. ఆమెను చూసిన మహేశ్, ఆమెతో ఎలాగైనా తన కోర్కె తీర్చుకోవాలనుకున్నాడు. అక్కడే వున్న తన స్నేహితుల ద్వారా సాలమ్మ ఫోన్ నెంబరు సంపాయించాడు. 
 
ఆ క్రమంలో ఆమెతో మాటలు కలిపాడు. మరుసటి రోజు మహేశ్ ఆమెకు ఫోన్ చేసి ఎక్కడ వున్నావని అడిగి ఆమె రమ్మన్న చోటికి వెళ్లాడు. ఆ తర్వాత ఆమెను బైక్ ఎక్కించుకుని నాగ్సాన్‌పల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెతో కోర్కె తీర్చుకున్నాడు. ఆ తర్వాత మరోసారి తన కోర్కె తీర్చాలని అడిగాడు మహేశ్. దాంతో డబ్బులిస్తే కోర్కె తీర్చుతానని మొండికేసిందా మహిళ.
 
ఇంటికి వెళ్లాక డబ్బులు ఇస్తాననీ, ఇప్పుడు తన కోర్కె తీర్చాలని బ్రతిమాలాడు మహేశ్. కానీ తనకు డబ్బు ఇస్తేనే ఒప్పుకుంటానని చెప్పడంతో ఆమె తలను బండరాయికేసి బలంగా కొట్టాడు. దాంతో ఆమెకి తీవ్ర గాయం కావడంతో రక్తస్రావమైంది. విషయాన్ని ఊర్లో చెపుతుందని భయపడి ఆమెను మళ్లీ బలంగా బండకేసి కొట్టి హతమార్చాడు. 
 
మరోవైపు సాలమ్మ కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో మహేశ్ బండారం బయటపడింది. అతడిని అరెస్టు చేసి రిమాండుకి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments