ఆక‌లితో అల‌మ‌టించొద్దు... సీఎం కేసీయార్ లక్ష్య‌మిది!

Webdunia
సోమవారం, 26 జులై 2021 (18:29 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆక‌లితో అలమటించకూడదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యంగా పెట్టుకున్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  తెలిపారు.

సోమవారం బేగంపేట లోని జురాస్టియాన్ క్లబ్ లో కొత్త తెల్లరేషన్ కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదప్రజలకు నిత్యావసర సరుకులను సబ్సిడీ పై అందించే తెల్లరేషన్ కార్డుల పంపిణీ ని రాష్ట్రవ్యాప్తంగా నేటినుండి ప్రారంభిస్తున్నట్లు వివరించారు.

హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రస్తుతం 5,85, 756 తెల్లరేషన్ కార్డ్ లు ఉన్నాయని, వీటి ద్వారా 21,90,034 మంది లబ్ది పొందుతున్నారని అన్నారు. నూతనంగాఅర్హత పొందిన 56, 064 తెల్లరేషన్ కార్డ్ లను లబ్దిదారులకు పంపిణీ చేయడం జరుగుతుందని, వీటి ద్వారా 2.25 లక్షల మందికి లబ్దిచేకూరుతుందని  మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు.

కొత్తగా కార్డులు పంపిణీ చేసిన వారికి ఆగస్టు నెల నుండే రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, కాలేరు వెంకటేష్, ఆర్డీవో వసంత, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్ లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Fauji shooting: తూఫ్రాన్ పేటలో ఫౌజీ షూటింగ్‌ - ప్రభాస్ కు గాయాలు వార్తలో అవాస్తవం లేదు !

Mohan Babu: మోహన్ బాబును చంద్రబాబు మోసం చేశాడా ? ఎందుకంటే...!

Nani: పారడైజ్ లో లౌడ్ ఎన్విరాన్‌మెంట్ పై కేర్ - విడుదల తేదీ మార్పు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి షోల్డర్ కీహోల్ సర్జరీ

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments