Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో రోజూ వేడెక్కిన తెలంగాణ అసెంబ్లీ... ఆరుగురు కాంగ్రెస్​ సభ్యుల సస్పెషన్​

Webdunia
ఆదివారం, 8 మార్చి 2020 (12:12 IST)
బడ్జెట్​ సమావేశాల రెండో రోజు అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా.. చేపట్టిన చర్చలో కాసేపు గందరగోళం నెలకొంది.

ఇదే సమయంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. సభా వ్యవహరాలకు అడ్డుపడుతున్నారంటూ ఆరుగురు కాంగ్రెస్​ సభ్యులను సభ నుంచి ఒక రోజు సస్పెండ్​ చేశారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

గవర్నర్​ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమవ్వగా.. కాంగ్రెస్​ సభ్యులు గవర్నర్​ ప్రసంగాన్ని వ్యతిరేకించారు. ప్రసంగం ఆసాంతం ప్రభుత్వాన్ని పోగడటమే సరిపోయిందని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు.

గవర్నర్​తో అబద్ధాలు.. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ తమిళిసైతో అబద్ధాలు చెప్పించారని కమలం పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్​ ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని కూడా అధికార పార్టీ నిలబెట్టుకోలేకపోయిందని తెలిపారు.

బడ్జెట్​ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని రాజాసింగ్​ స్పష్టం చేశారు. సీఏఏపై తర్వాత చర్చిద్దాం.. చర్చలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్.. సీఏఏ అంశాన్ని ప్రస్తావించారు.

ఈ అంశంపై సభలో చర్చ జరగాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ ఇది సమయం కాదని హితవు పలికారు. సీఏఏపై తర్వాత చర్చిద్దామని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి ఆగ్రహం.. కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి గవర్నర్​ ప్రసంగంపై నిప్పులు చెరిగారు.

ఈక్రమంలోనే అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మాట్లాడుతుండగా మంత్రి ప్రశాంత్​రెడ్డి అడ్డుపడ్డారు. ప్రజల తరపున ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని రాజగోపాల్​రెడ్డి మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కువ మంది స్టార్లు ఉన్న చిత్రాల్లో నటించేందుకు జంకుతాను : నయనతార

మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా గుడ్‌బై... 'ప్రేమలు' బ్యూటీ వెల్లడి

'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్ - 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తర్వాతి కథనం
Show comments