Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వీటీని చూసి సంబరపడిపోయిన తెలంగాణ సీఎం కేసీఆర్...

స్వీటీని చూసి తెలంగాణ ముఖ్యమంత్రి సంబరపడిపోయారు. స్వీటి అనగానే బాహుబలి అనుష్క అనుకుంటారంతా.. కానీ ఆమె కాదు. ఈమె పేరు సంజన అలియాస్ స్వీటీ. ఆమె మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందినది. తన చదువు పూర్తయినా తను అనుకున్న కోర్సు చేసేందుకు డబ్బు లేదని ఆమె గతంలో తె

Webdunia
సోమవారం, 17 జులై 2017 (15:13 IST)
స్వీటీని చూసి తెలంగాణ ముఖ్యమంత్రి సంబరపడిపోయారు. స్వీటి అనగానే బాహుబలి అనుష్క అనుకుంటారంతా.. కానీ ఆమె కాదు. ఈమె పేరు సంజన అలియాస్ స్వీటీ. ఆమె మెదక్ జిల్లా కౌడిపల్లికి చెందినది. తన చదువు పూర్తయినా తను అనుకున్న కోర్సు చేసేందుకు డబ్బు లేదని ఆమె గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అభ్యర్థించారు. 
 
విషయం తన దృష్టికి రావడంతో స్వీటీ పైలెట్ కోర్సుకు అవసరమైన రూ.30 లక్షల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంగా అందించారు. ఆ డబ్బును అందిస్తూ... బాగా చదువుకుని అనుకున్నది సాధించాలని చెప్పారు. ముఖ్యమంత్రి నిధులతో ఆమె అమెరికాలో పైలట్ కోర్సు చేసి ఉద్యోగాన్ని కూడా సంపాదించారు. 
 
ఈ సంతోషకరమైన విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ను స్వయంగా కలిసి తెలియజేశారు. ఆమెకు ఉద్యోగం వచ్చిందన్న విషయాన్ని తెలుసుకుని కేసీఆర్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ... మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆశీర్వదించారు. ఆమె స్ఫూర్తితో మరింతమంది ఉన్నతమైన చదువులు చదివి అగ్రస్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు కేసీఆర్.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments