మానవ సంబంధాలను ఛిద్రం చేసిన కరోనా... రిక్షాలో శవం తరలింపు

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (08:30 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కేవలం మానవ ప్రాణాలనే కాదు.. మానవ సంబంధాలనే ఛిద్రం చేస్తున్నాయి. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తరలించేందుకు ఏ ఒక్కరూ ముందుకురాలేదు. దీంతో ఆ మృతదేహాన్ని రిక్షాలో తరలించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ విషాదకర సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారానికి చెందిన కోసరి రాజవ్వ (56) గురువారం సాయంత్రం మృతి చెందింది. బంధువులు, శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని తెలియజేశారు.
 
అయితే, కరోనా భయంతో ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమెను కడసారి చూసేందుకు రాలేదు. గ్రామస్థులంటారా.. ఇక చెప్పనక్కర్లేదు. దీంతో అంత్యక్రియలు నిర్వహించడం ఎలానో తెలియక కుటుంబ సభ్యులు తలలు పట్టుకున్నారు. 
 
కనీసం పాడె మోసేందుకూ నలుగురంటే నలుగురు కూడా రాలేదు. దీంతో చివరికి చెత్తను తరలించే రిక్షాపై ఆమె మృతదేహాన్ని శ్మశానానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఇలాంటి దుస్థితిని ఈ కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా తీసుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SSRajamouli: వారణాసితో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఇలా వున్నాయంటున్న రాజమౌళి

అనిల్ రావిపూడి తదుపరి ప్రాజెక్టుపై ప్రకటన.. హీరోలు ఎవరంటే...

Anil ravipudi: కళ్యాణ్ రామ్, వెంకటేష్ తో సంక్రాంతి కి వస్తున్నా: అనిల్ రావిపూడి

Virosh Wedding : నేను ఆమెను మిస్ అయ్యానన్న విజయ్.. నీ భార్యగా నేను.. నా భర్తను పరిచయం చేస్తున్నాను.. (Photos)

Sri Vishnu: గ్రహాలని, జాతకాలలో కొన్నింటినే ఫాలో అవుతా : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు పైబడకుండా చేసే బాదం పప్పు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తుమ్ములు, వదలని దగ్గు వస్తే HMPV వ్యాధి కావచ్చు, ఏం చేయాలి?

తులసి రసంతో తేనెను కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

సీజనల్ వ్యాధులను దరిచేరకుండా చేసే సూప్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments