సీబీఎస్ఈ టెన్త్‌లోనే తెలంగాణాలో పది పరీక్షలు

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (09:44 IST)
సెంట్రల్ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులు చేయనుంది. ఈ విధానాన్నే పదో తరగతిలోనూ ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా రెండుసార్లు వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు. 
 
ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ), ప్రభుత్వ పరీక్షల విభాగం (ఎస్ఎస్‌సీ బోర్డు) అధికారులు కసరత్తుకు శ్రీకారం చుట్టారు. 
 
తూతూమంత్రంగా పరీక్షలు నిర్వహించిన గ్రేడ్‌లు కేటాయించొద్దన్న కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విధానం అమల్లోకి వస్తే టెన్త్ విద్యార్థులు ఇకపై రెండుసార్లు బోర్డు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. 
 
తొలి ఆరు నెలలకు నవంబరు/డిసెంబరులో, ఆ తర్వాతి ఆరు నెలలకు విద్యా సంవత్సరం చివరిలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండింటిలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలు ప్రకటిస్తారు.
 
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండేళ్ళుగా విద్యా రంగం తీవ్రంగా నష్టపోయిన విషయం తెల్సిందే. ముఖ్యంగా ఈ  యేడాది ఏ ఒక్క పరీక్షను కూడా నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. దీంతో సీబీఎస్ఈ యేడాదిలో రెండు బోర్డు పరీక్షలు నిర్వహించాలని భావించాలని నిర్ణయించగా, ఇదే విధానాన్ని తెలంగాణ సర్కారు అనుసరించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గబ్బర్ సింగ్ రమేష్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి ఆర్థికసాయం

పౌరసత్వాన్ని వదులుకుంటానంటున్న అఖిల్ అక్కినేని

కోర్కెలు తీర్చుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చా : రకుల్ ప్రీత్ సింగ్

అమీర్ లోగ్ చూస్తే హైదరాబాదీల మీద గౌరవం పెరుగుతుంది : దర్శకుడు రమణా రెడ్డి

స్క్రిప్ట్ విన్నప్పుడు సందేహం ఉండేది, ఇప్పటి ఆదరణకు ఆనందగా వుంది : కిరణ్ అబ్బవరం

తర్వాతి కథనం
Show comments