సింగరేణి గనుల్లో పేలుడు.. ఐదుగురు కార్మికుల మృత్యువాత?

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (13:31 IST)
సింగరేణి గనుల్లో పేలుడు సంభవించింది. బ్లాస్టింగ్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో ఐదుగురు కార్మికుల ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. పేలుడు ధాటికి శరీరభాగాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. 
 
నిజానికి జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. దీంతో రాష్ట్రం యావత్తూ ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో మునిగిపోయింది. ఈ ఆనంద సమయంలో సింగరేణి గనుల్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. 
 
ఓపెన్ కాస్ట్-1 గనిలోని ఫేజ్-2లో బ్లాస్టింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బ్లాస్టింగ్‌కు అవసరమైన ముడిపదార్థాలు నింపుతున్న సమయంలో ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించింది. పేలుడు ధాటికి సంఘటన స్థలంలో బీభత్సం నెలకొంది. ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దు గాయపడ్డారు. 
 
ఇదిలావుంటే అస్సాంలో కొండ చరియలు విరిగిపడి మరో 20 మంది చనిపోయారు. అనేక మంది గాయ‌ప‌డ్డారు. ద‌క్షిణ అస్సాంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు అందాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi : ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్ తో వచ్చారు : రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments