పెద్దిరెడ్డి ఎంత పనిచేశావు, ఈ దెబ్బతో కాషాయంకు కష్టాలేనా?

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (20:46 IST)
హుజారాబాద్ ఎన్నికలకు ముందు నేతల వరుస రాజీనామాలు బిజెపికి తలనొప్పిగా మారుతున్నాయి. మొన్న మోత్కుపల్లి, నేడు పెద్దిరెడ్డిలు పార్టీకి రాజీనామాలు చేశారు. ఈటెల రావడంతో తమ ప్రాధాన్యత పోతుందని ఆందోళన చెందుతున్న నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు.
 
మాజీ మంత్రి పెద్దిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీలో చర్చకు దారితీస్తోంది. తన రాజీనామా లేఖను తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపారు. తాజా రాజకీయ పరిణామాల బట్టి ఇక తాను ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో పార్టీలో కొనసాగలేనని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.
 
గతంలో కరీంనగర్ జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందిన పెద్దిరెడ్డి గత కొంత కాలంగా బిజెపి కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల ఈటెల రాజేందర్ బిజెపిలో చేరిన తరువాత ఆయన పార్టీకి దూరమవుతున్నారన్న ప్రచారం జోరుగానే సాగింది. 
 
హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్టును ఆశించిన పెద్దిరెడ్డి తాజా రాజకీయ పరిణామాలతో నిరాశకు గురయ్యారన్న వాదనలు కూడా వినిపించాయి. తనతో చర్చించకుండానే ఈటెలను పార్టీలోకి తీసుకున్నారని పెద్దిరెడ్డి అసంతృప్తితో ఉన్నారట.
 
ఈ పరిస్థితుల్లోనే పెద్దిరెడ్డి బిజెపికి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి డికె అరుణ పెద్దిరెడ్డితో పలుమార్లు చర్చలు కూడా జరిపారు. పార్టీలో ప్రాధాన్యత దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు. కానీ పెద్దిరెడ్డి మాత్రం బిజెపిలో కొనసాగే విషయంలో అయిష్టంగానే ఉంటూ వచ్చారు.
 
తాజా పరిణామలతో బిజెపికి గుడ్ బై చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు ఆ నియోజకవర్గంలో పట్టున్న పెద్దిరెడ్డి బిజెపి రాజీనామా చేయడం ఆ పార్టీకి మైనస్‌గా మారే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ ప్రోమో

'థామా' నుంచి నువ్వు నా సొంతమా పాట రిలీజ్

Geethamadhuri : కానిస్టేబుల్ లో గీతామాధురి పాడిన ధావత్ సాంగ్ కు ఆదరణ

Dil Raju: తేజసజ్జా తో దిల్ రాజు చిత్రం - ఇంటికి పిలిచి ఆత్మీయ వేడుక జరిపాడు

Anupam Kher: కాంతార ఛాప్టర్ 1 చూశాక మాటలు రావడంలేదు : అనుపమ్ ఖేర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments