Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడి వేడి బజ్జీల కోసం సైరన్ మోగించిన ఆంబులెన్స్ డ్రైవర్ (వీడియో వైరల్)

Webdunia
బుధవారం, 12 జులై 2023 (16:38 IST)
Ambulance
వర్షాకాలం వేడి వేడి బజ్జీలు తినాలనుకుని అంబులెన్స్ డ్రైవర్ ఏం చేశాడో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. చిప్స్, బజ్జీలు కొనేందుకు తెలంగాణలో అంబులెన్స్ డ్రైవర్ రోడ్డు సైడ్ అంబులెన్స్ నిలిపేసిన వీడియా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
 
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఓ అంబులెన్స్ సైరన్ మోగిస్తూ రోడ్డుపైకి దూసుకెళ్లింది. కానీ అంబులెన్స్ ప్రమాద స్థలానికి లేదా ఆసుపత్రికి వెళ్లకుండా రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్ ముందు ఆగింది. ఈ అంబులెన్స్‌లో పేషెంట్‌ లేకపోయినా సైరన్‌ మోగింది.
 
దీంతో అంబులెన్స్ డ్రైవర్‌ను విచారించారు. తన అవసరాల కోసం సైరన్‌ మోగించి ట్రాఫిక్‌ ఉల్లంఘనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. రోడ్డుపై సిగ్నల్ వద్ద నిలబడి ఉన్న ఓ ట్రాఫిక్ పోలీసు ఈ విషయాన్ని గమనించాడు.
 
దీనిపై కానిస్టేబుల్ అంబులెన్స్ డ్రైవర్‌ను విచారించడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

వేవ్స్ సమ్మిట్ 2025 కు ఆహ్వానం గౌరవంగా భావిస్తున్నా : జో శర్మ

ఇద్దరి హీరోయిన్లను దాటుకుని దక్కిన అవకాశం భాగ్యశ్రీ బోర్సే కు లక్క్ వరిస్తుందా ?

విజయ్ దేవరకొండ గిరిజనుల మనోభావాలను కించపరిచాడా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments