Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ షర్మిలకు మద్దతు ప్రకటించిన రెడ్డి సంఘాలు

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (19:58 IST)
తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్టు మాజీ ముఖ్యమత్రి దివంత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ప్రకటించారు. ఆ దిశగా ఆమె వడివడిగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ఏర్పాటులో భాగంగా, ఆమె జిల్లాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో పార్టీ నేతలు ఇస్తున్న క్షేత్రస్తాయి సమాచారాన్ని తీసుకుంటున్నారు. 
 
అదేసమయంలో ఆమె అడుగులు తెలంగాణాలో రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఆమెకు మద్దతు పలుకుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించిన ఆమెకు... వైయస్ అభిమానులు అండగా నిలుస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో షర్మిలను రెడ్డి సంఘాల నేతలు కలిశారు. షర్మిల పెట్టబోతున్న పార్టీకి తమ సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పారు. షర్మిలతో భేటీ అనంతరం రెడ్డి సంఘాల జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు నవల్ల సత్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
తెలంగాణలోని రెడ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారన్నారు. రాష్ట్రంలో రెడ్లకు రాజకీయంగా దిక్కు లేకుండా పోయిందని, ప్రాధాన్యత తగ్గిపోయిందని మండిపడ్డారు. రెడ్డి కార్పొరేషన్ ఇస్తామని చెప్పిన కేసీఆర్... ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు. షర్మిల పార్టీతో తెలంగాణలో రెడ్లకు పూర్వ వైభవం వస్తుందని అన్నారు. షర్మిలకు రాష్ట్రంలోని రెడ్లంతా మద్దతు పలుకుతారని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments