Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో బాదుడుకి సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ

Webdunia
బుధవారం, 20 జులై 2022 (09:04 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చార్జీల బాదుడు పేరుతో ప్రయాణికుల నడ్డి విరిస్తుంది. ఇప్పటికే పలుమార్లు ఈ చార్జీలను పెంచేసింది. ఇపుడు మరోమారు బాదుడుకు రంగం సిద్ధం చేసింది. లగేజీ చార్జీల రూపంలో మోత మోగిచనుంది. ప్రస్తుతాని 50 కేజీల లగేజీ వరకు ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు వుంది. ఆ తర్వాత అదనపు లగేజీ పేరుతో మరింత భారం మోగనుంది. 
 
అదనంగా ఒక కిలో పెరిగినా.. పాతిక కేజీల వరకు ఒక యూనిట్‌గా పరిగణించి.. పూర్తి చార్జీని వసూలు చేస్తారు. పెయిడ్‌ లగేజీలో 25 కిలోలు దాటితే మరో యూనిట్‌గా చార్జీ వసూలు చేస్తారు. అంటే.. ప్రతి యూనిట్‌కు ఇప్పటివరకు పల్లెవెలుగు బస్సుల్లో 25 కిలోమీటర్ల దూరం వరకు రూ.1 వసూలు చేసేవారు. ఈ నెల 22 నుంచి ఆ చార్జీని రూ.20కి పెంచనున్నారు. అంటే ఒకేసారి ఏకంగా రూ.19 పెంచనున్నారు. 
 
అలాగే, అదే 26-50 కి.మీ మధ్య లగేజీ చార్జి ప్రతి యూనిట్‌కు ఇంతకుముందు రూ.2గా ఉండగా.. రూ.40కి సవరించారు. 51-75 కి.మీ. మధ్య రూ.3కు గాను రూ.60గా.. 76-100 కి.మీ మధ్య రూ.4కు గాను రూ.70గా చార్జీలను సవరించారు. ఇలా కిలోమీటర్ల వారీగా లగేజీ చార్జీల మోతమోగింది. 
 
డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో లగేజీ చార్జీల పెంపు అనివార్యంగా మారిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 2002లో లగేజీ చార్జీలను సవరించారని.. ఆ తర్వాత 20 ఏళ్లకు ఇప్పుడే సవరణ జరిగిందని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments