తెలంగాణ: ఇంట‌ర్‌లో ప్ర‌వేశాల‌కు షెడ్యూల్ విడుద‌ల‌

Webdunia
మంగళవారం, 25 మే 2021 (23:13 IST)
ఇంటర్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణ ఇంట‌ర్‌మీడియ‌ట్ బోర్డు.. ఇవాళ్టి నుంచి జులై 5వ తేదీ వ‌ర‌కు ప్ర‌వేశాలకు అనుమ‌తి ఇచ్చింది. జూన్ 1 నుంచి ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి.

ఇంట‌ర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా ప్రాథ‌మిక‌ ప్ర‌వేశాలు చేసుకోవాల్సిందిగా ఇంట‌ర్‌బోర్డు సూచించింది. అనంత‌రం ఎస్ఎస్‌సీ పాస్ స‌ర్టిఫికేట్‌, టీసీ, స్ట‌డీ స‌ర్టిఫికెట్ల ఆధారంగా ప్ర‌వేశాల‌ను ధ్రువీక‌రించాల‌ని పేర్కొంది. ఇక‌, 10వ తరగతిలో వచ్చిన గ్రేడ్స్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల‌ని.. ఎలాంటి అడ్మిషన్ టెస్ట్ లు నిర్వహించకూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

ఇదే స‌మ‌యంలో.. అనుమతికి మించి విద్యార్థులను కూడా చేర్చుకోవ‌ద‌ని ఆదేశించింది.. విద్యార్థుల అడ్మిష‌న్స్‌కు ఆధార్ కార్డ్ తప్పనిసరి అని పేర్కొంది. మ‌రోవైపు.. కళాశాలల అనుబంధ గుర్తింపు పూర్తి కాకముందే అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల చేసింది ఇంటర్ బోర్డ్.. నిన్నటితో కళాశాలల అనుబంధ గుర్తింపు దరఖాస్తు గ‌డువు ముగిసిపోగా.. ఆ ద‌ర‌ఖాస్తులను ప‌రిశీలించాల్సి ఉంది.. ఈలోగానే ప్ర‌వేశాల‌కు షెడ్యూల్ విడుద‌ల చేసింది.. ఇక‌, అనుబంధ గుర్తింపు ఉన్న కళాశాలల్లో మాత్రమే చేరాలని చెబుతున్నారు ఇంట‌ర్‌బోర్డు అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండ్రి కూతురు సెంటిమెంట్ తో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్

Sri Vishnu: విష్ణు విన్యాసం స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది : శ్రీ విష్ణు

Anupama: అనుపమ పరమేశ్వరన్ తో అగ్ర నిర్మాణ సంస్థ కొత్త మూవీ ప్రకటన

INCA: ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక

Chiranjeevi: సురేఖ నా భార్య మాత్రమే కాదు, నా బలం, నా అండ, నా ప్రశాంతత : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

తర్వాతి కథనం
Show comments