Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం కేసులో మహిళా కార్పొరేటర్ భర్త అరెస్టు

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (14:10 IST)
తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లా కేంద్రంలో ఓ అత్యాచార కేసులో మహిళా కార్పొరేటర్ భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఇది స్థానికంకా సంచలనమైంది. ఈ విషయాన్ని వరంగల్‌ పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్పొరేటర్‌ భర్త శిరీష్‌ తనను పెళ్లి పేరిట నమ్మించి ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి మిల్స్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
దీంతో సెప్టెంబర్‌ 23వ తేదీన కార్పొరేటర్‌ భర్తపై అత్యాచారం, నమ్మకద్రోహం, మోసం, బెదిరింపుల కింద కేసులు నమోదు చేసినట్లు మీల్స్‌ కాలనీ పోలీసులు తెలిపారు.
 
అప్పటి నుంచి శిరీష్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న శిరీష్‌ను గురువారం అర్థరాత్రి అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14రోజుల రిమాండ్‌ విధించారు. అనంతరం నిందితుడిని పరకాల జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments