Webdunia - Bharat's app for daily news and videos

Install App

పని ఉందంటూ తీసుకెళ్లి హత్యాచారం - ఇద్దరు వ్యక్తుల దుర్మార్గం

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (07:55 IST)
తెలంగాణా రాష్ట్రంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. వరుస అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళను పని ఉందని చెప్పి తీసుకెళ్లిన ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారు. ఆ తర్వాత తలపై బండరాయితో కొట్టి చంపేశారు. ఈ దారుణం శంషాబాద్ మండల పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మదనపల్లి కొత్త తండాకు చెందిన ఓ మహిళ(40) దినసరి కూలీ. రోజులాగానే బుధవారం ఉదయం శంషాబాద్‌లోని అడ్డా దగ్గర నిలబడింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పని ఉందంటూ ఆమెను పిలిచారు. ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని కవ్వగూడ వ్యవసాయ పొలాల్లోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. 
 
ఆ తర్వాత బండరాయితో తలపై మోది పరారయ్యారు. రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని స్థానిక రైతులు గమనించి 100కు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృత్యువాత పడిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments