చార్మినార్ వద్ద బీజేపీ సభ పెడితే.. తల నరికేస్తామన్నారు-బండి సంజయ్

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (19:31 IST)
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనకు బెదిరింపులు వచ్చేవని బీజేపీ ఎంపీ, తెలంగాణ మాజీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. చార్మినార్ వద్ద బీజేపీ సభ పెడితే తన భార్య తలను నరికి బహుమతిగా పంపిస్తానని వెల్లడించారు. 
 
తన కుమారులను కిడ్నాప్ చేస్తానని కూడా బెదిరించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కూడా తనలాగే చాలా బెదిరింపులు వచ్చాయని సంజయ్ పేర్కొన్నారు. అయినా తాను ధైర్యంగా ఉన్నానని, హిందూ ధర్మం కోసం తన పోరాటం కొనసాగిస్తున్నానని రాజాసింగ్ అన్నారు. 
 
బీజేపీకి దూరంగా ఉండి ఏడాది కావస్తున్నా ధర్మపోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. బీజేపీ గెలుస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఇక బీజేపీ గెలిస్తే బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు.
 
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ నేతల ఎన్నికలో మాటల తూటాలు పేలుతున్నాయి. 
 
ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీలు, అభ్యర్థులపై విమర్శలు గుప్పించడమే కాకుండా ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు చేస్తూ ప్రచారాన్ని ఊపందుకుంటున్నారు. 
 
కరీంనగర్ అసెంబ్లీ సర్కిల్‌లో నిలిచిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఉద్వేగభరితమైన ప్రసంగాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తనకు ఎలాంటి బెదిరింపులు ఎదురయ్యాయో సంజయ్ ఇటీవల కరీంనగర్ ప్రజలకు వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Netflix నెట్ ఫ్లిక్స్ నిజంగానే స్కిప్ అడల్ట్ సీన్ బటన్‌ను జోడించిందా?

Allu Arjun: అట్లీ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ లో కనిపించనున్నాడా !

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments