Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల్వంచలో పెద్దపులి అలజడి.. ఆ పులి గర్భంతో వుండవచ్చు..

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (08:34 IST)
ఖమ్మం జిల్లాలోని పాల్వంచ మండలంలో పెద్దపులి సంచరిస్తోందని.. అందరూ జాగ్రత్తగా వుండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతంలో పెద్దపులి అలజడి సృష్టించడంతో మండలంలోని ప్రభాత్‌ నగర్‌, ఆయిల్‌పాం సమీప ప్రాంతాల్లో పులి పాదముద్రలను అక్కడి స్థానికులు చూసి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో కిన్నెరసాని వైల్డ్‌లైఫ్‌ అధికారులు ఆ ప్రాంతాలను పరిశీలించారు. 
 
ఆ పాదముద్రలు పులివేనని నిర్ధారించారు. వాటి నమూనాలను సేకరించారు. 'ఈ ప్రాంతంలో పులి సంచించినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి. అటవీప్రాంతాల్లో ఒంటరిగా తిరగొద్దు. అవసరమైతే గుంపులుగా వెళ్లాలి. ట్రాక్టర్‌ హారన్‌ను పదే, పదే మోగించకూడదు' అని అధికారులు సూచించారు. 'ఆ పులి గర్భంతో ఉండవచ్చు. సురక్షిత ప్రాంతం కోసం తిరుగుతున్నట్లున్నది. అడవులకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి' అని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Fauj Latest update :: స్వదేశం పక్షాన ఆంగ్లేయులతో పోరాటానికి దిగిన ఫౌజీ గా ప్రభాస్

రామాయణ గాథా చిత్రణ కారణంగా ఆదిపురుష్ పై మళ్లీ వ్యతిరేకత

Divi: స్టువర్టుపురం స్టూడెంట్స్ లో నేను భరతనాట్యం, బెల్లి డాన్స్ చేశా : దివి

Suriya: హృదయాలను హత్తుకునే విధంగా సూర్య చిత్రం విశ్వనాథ్ & సన్స్ ట్రైలర్

సింగిల్‌గా ఉండటమే చాలా సంతోషంగా ఉంది : అమీషా పటేల్

తర్వాతి కథనం
Show comments