నేడు, రేపు తెలంగాణలో వర్షాలు

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (09:15 IST)
బంగాళాఖాతంలో ఒడిశా, ఏపీ తీరానికి సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం ఉంది.

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ దక్షిణ ప్రాంతంలో 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో శని, ఆదివారాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల శుక్రవారం స్వల్పంగా వానలు పడ్డాయి.

నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 4 క్రస్టుగేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 1,22,376 క్యూసెక్కులుండగా, అవుట్ ఫ్లో 1,05,776 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలుండగా.. ప్రస్తుతం 310.8498 టీఎంసీలు ఉంది. నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు.. కాగా ప్రస్తుతం 589.60 అడుగులు ఉంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పౌరసత్వాన్ని వదులుకుంటానంటున్న అఖిల్ అక్కినేని

కోర్కెలు తీర్చుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చా : రకుల్ ప్రీత్ సింగ్

అమీర్ లోగ్ చూస్తే హైదరాబాదీల మీద గౌరవం పెరుగుతుంది : దర్శకుడు రమణా రెడ్డి

స్క్రిప్ట్ విన్నప్పుడు సందేహం ఉండేది, ఇప్పటి ఆదరణకు ఆనందగా వుంది : కిరణ్ అబ్బవరం

Jai Krishna: కొన్ని చోట్ల అలా అనిపించొచ్చు, వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి ఉంది : జై కృష్ణ ఘట్టమనేని

తర్వాతి కథనం
Show comments