Webdunia - Bharat's app for daily news and videos

Install App

సార్.. చేతులు జోడించి చెపుతున్నా : కలెక్టర్ అమ్రపాలిపై కేటీఆర్ ఫైర్

వరంగల్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాటాపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బిత్తరపోయిన కలెక్టర్ రెండు చేతులు జోడించి ఏదో వివరణ ఇవ్వబోయింది. అయినప్పటికీ ఆయన శాంతించలేదు.

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2017 (10:36 IST)
వరంగల్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాటాపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బిత్తరపోయిన కలెక్టర్ రెండు చేతులు జోడించి ఏదో వివరణ ఇవ్వబోయింది. అయినప్పటికీ ఆయన శాంతించలేదు. 
 
వరంగల్ జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్‌లో శనివారం సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్ అమ్రపాలి సారథ్యంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అందరి పనితీరుపై తీవ్ర అసంతృప్తిని మంత్రి కేటీఆర్ వ్యక్తంచేశారు. 
 
రెండున్నరేళ్ల క్రితం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలే అమలు కావడం లేదని, పనులు ముందడుగు వేయడం లేదని, ఇచ్చిన నిధులు ఖర్చు పెట్టడం లేదని కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ ఆమ్రపాలి కల్పించుకోగా, తనతో వాదించవద్దని కేటీఆర్ గద్దించారు.
 
ఆపై ఆమ్రపాలి చేతులు జోడించి వరంగల్ పట్టణ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి సర్దిచెప్పబోయినట్టు తెలుస్తోంది. సీరియస్‌గా చూస్తున్న కేటీఆర్ వైపు నమస్కరించి నిలబడి ఏదో మాట్లాడుతున్న ఆమ్రపాలి ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉత్తమ కలెక్టర్లలో అమ్రపాలి కాటా ఒకరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments