Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలా చేస్తే కాంగ్రెస్‌కు నా మద్దతు : పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రజా యాత్రలో భాగంగా బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయలో తనపై ఘాటైన విమర్శలు చేయడమే కాకుండా, మూడు పెళ్లిళ్లు చేసుకున్న వ

Webdunia
గురువారం, 25 జనవరి 2018 (08:51 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రజా యాత్రలో భాగంగా బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయలో తనపై ఘాటైన విమర్శలు చేయడమే కాకుండా, మూడు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి అంటూ పవన్‌పై ఘాటైన విమర్శలు చేసిన నేతల్లో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ (వి.హనుమంతరావు) ఒకరు. అలాగే, పవన్ కల్యాణ్ పార్టీ ‘జనసేన’ కాదని, ‘భజనసేన’ అని ఆయన ఘాటుగా విమర్శించారు. కానీ, ఇపుడు అదే హనుమంతరావును సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజా యాత్రలో ప్రకటించడం ఇపుడు చర్చనీయాంశమైంది. 
 
బుధవారం ఖమ్మం పర్యటనలో ఆయన మాట్లాడుతూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్)ని తెలంగాణ సీఎం అభ్యర్థిగా కనుక ప్రకటిస్తే, ఆ పార్టీకి తాను మద్దతిస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేస్తే, ఆ పార్టీ తరపున నిలబడి ప్రచారం చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలందరిపైనా తనకు గౌరవం ఉందని, అలాగే, వీహెచ్ పైనా ఉందని, ఎవరిపైనా ద్వేషం లేదని స్పష్టం చేశారు. 
 
'వీహెచ్ తో కలిసి పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. వీహెచ్.. మీరు నాతో రండి. ఇంటింటికి తిరుగుదాం.. ప్రజాసమస్యలను తెలుసుకుందాం' అని పవన్ అన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి, ప్రభుత్వానికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా పవన్ కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Imanvi: ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి ఇమాన్విని తొలగించండి

మరో సినిమాకు రెడీ అయిన నందమూరి కళ్యాణ్ రామ్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments