Webdunia - Bharat's app for daily news and videos

Install App

మినీ మున్సిపల్ ఎన్నికలు.. మద్యం దుకాణాలు తెరొవద్దు..

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (10:25 IST)
తెలంగాణలో మినీ మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ సమీక్ష నిర్వహించింది. ఎక్సైజ్ అధికారులతో ఎస్ఈసీ పార్థసారధి సమీక్షించారు. 2021, ఏప్రిల్ 30వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. 
 
పోలింగ్‌కు 48 గంటల ముందు.. కౌంటింగ్ ముందు, కౌంటింగ్ రోజు.. బెల్ట్ షాపులు, మద్యం దుకాణాలు తెరొవద్దని ఎస్ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు వ్యక్తుల వద్ద అనుమతికి మించి మద్యం ఉండరాదని ఆదేశాలు జారీ చేసింది.
 
50 శాతానికి మించి మద్యం అమ్మకాలు జరిగితే.. ప్రత్యేక నిఘా పెట్టాలని పార్థసారధి సూచించారు. ప్రత్యేక చెక్ పోస్టులు పెట్టి.. అక్రమ మద్యం రవాణాను నివారించాలన్నారు. 
 
పోలీసులతో సమన్వయం చేసుకుని నిబంధనలను అమలు చేయాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ ఉప ఎన్నికపైనా కూడా ఆయన సమీక్షించారు. ఉప ఎన్నిక సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments