Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను... దూరం పెట్టడం వల్లే నిప్పంటించా : కార్తీక్

సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన సంధ్యారాణి అనే యువతిపై ఓ ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించగా, ఆ యువతి శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో ప్రేమోన్మాది గురువారం రాత్రే పోలీసులకు లొంగిపోయాడు.

Webdunia
శుక్రవారం, 22 డిశెంబరు 2017 (12:24 IST)
సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన సంధ్యారాణి అనే యువతిపై ఓ ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించగా, ఆ యువతి శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో ప్రేమోన్మాది గురువారం రాత్రే పోలీసులకు లొంగిపోయాడు. ఆ తర్వాత తాను ఈ దుశ్చర్యకు పాల్పడటానికి గల కారణాలను పోలీసులకు వెల్లడించాడు. 
 
మూడేళ్ళుగా సంధ్యారాణితో పరిచయం ఉందనీ, ఆమెను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని చెప్పారు. కానీ, తన ప్రేమను కాదనడంతో తట్టుకోలేకనే ఇంత దారుణానికి ఒడిగట్టానని చెప్పాడు. అదేసమయంలో తనను దూరం పెట్టిన సంధ్య.. మరో యువకుడికి దగ్గరై, తనతో మాట్లాడటం మానేసిందని, సంధ్యకు ఫోన్ చేస్తే, అతనే లిఫ్ట్ చేస్తుండేవాడని, సంధ్య జోలికి రావద్దని బెదిరించాడని, తన కొలీగ్‌తో ఆమె ప్రేమలోపడి అతనితో సన్నిహితంగా ఉండటంతో తానెంతో కుమిలిపోయానని, తనను అవాయిడ్ చేసినందుకే ఈ పని చేశానని కార్తీక్ చెప్పుకొచ్చాడు. 
 
కాగా, సికింద్రాబాద్‌లోని లాలాపేట ప్రాంతంకు చెందిన సంధ్యారాణిని ప్రేమిస్తూ వచ్చిన కార్తీక్ అనే యువకుడు, ఆమె తనను తిరస్కరించిందన్న కారణంతో, నడిరోడ్డుపై ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం 6.45 గంటల ప్రాంతంలో లాలాపేట అంబేద్కర్ విగ్రహం వద్ద కార్తీక్ ఈ ఘాతుకానికి పాల్పడగా, 80 శాతం కాలిన గాయాలతో బాధితురాలు, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో కార్తీక్ ఆ వెంటనే లొంగిపోగా, అతనిపై పెట్టిన హత్యాయత్నం కేసును, ఇప్పుడు హత్య కేసుగా మార్చనున్నట్టు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.  అలాగే, ఎస్సీఎస్టీ అట్రాసిటీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments