Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు బీమా పథకం యాడ్.. ఫోజిచ్చిన పాపానికి కుటుంబంలో చిచ్చు..

రైతు బీమా పథకం కోసం ఫోటోకు ఫోజిచ్చిన పాపానికి ఓ మహిళ జీవితం నాశనమైంది. రైతుబీమా, కంటి వెలుగు పథకాలను తెలంగాణ సర్కారు చేపట్టిన సంగతి తెలిసిందే. లక్షలాది రైతులకు బాసటగా నిలిచిన ఈ పథకంలో ఓ రైతు కుటుంబం బ

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (18:14 IST)
రైతు బీమా పథకం కోసం ఫోటోకు ఫోజిచ్చిన పాపానికి ఓ మహిళ జీవితం నాశనమైంది. రైతుబీమా, కంటి వెలుగు పథకాలను తెలంగాణ సర్కారు చేపట్టిన సంగతి తెలిసిందే. లక్షలాది రైతులకు బాసటగా నిలిచిన ఈ పథకంలో ఓ రైతు కుటుంబం బొమ్మ ప్రస్తుతం చర్చకు దారితీసింది. ఈ పథకాల కోసం ఉపయోగిస్తున్న ప్రింట్ యాడ్లు ఓ వివాహిత జీవితాన్ని చిందరవందర చేశాయి.
 
ఈ రైతు బీమా తెలుగు యాడ్‌లో భర్తతో మహిళ ఫోటో వుండగా, ఇంగ్లీష్ పేపర్లో మాత్రం వివాహిత భర్త స్థానంలో వేరొకరిని ప్రింట్ చేయడం ప్రస్తుతం సదరు మహిళకు ఇబ్బందులను కొనితెచ్చిపెట్టింది. ఆమె భర్త స్థానంలో మరొక వ్యక్తిని పెట్టడంపై కాపురంలో కుంపట్లను రాజేసినట్లైంది. తెలుగు వార్తా పత్రికల్లో వచ్చిన యాడ్లలో ఆమె పక్కన ఆమె భర్తే వున్నప్పటికీ.. ఇంగ్లీష్ పత్రికలకు ఇచ్చిన యాడ్లలో మాత్రం ఆమె భర్త స్థానంలో వేరొక వ్యక్తివున్నాడు. ఇది వారి కాపురంలో అశాంతికి కారణమైంది. 
 
ఇంకా భార్యాభర్తల మధ్య విబేధాలకు దారితీసింది. అంతేగాకుండా బంధువులు కూడా సదరు మహిళను సూటిపోటి మాటలతో హింసించసాగారు. ఈ వ్యవహారంపై సదరు మహిళ మండిపడింది. తన పక్కన వేరే వ్యక్తిగా భర్తగా ఎలా చూపిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర ప్రచార, సమాచార శాఖ రంగంలోకి దిగింది. ఇందుకు కారణమైన రెండు ఏజెన్సీలను వివరణ ఇవ్వాలంటూ కోరుతూ నోటీసులు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments