Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాన్సుల కోసం అడుక్కుంటున్నానా.. అంత ఖర్మేం పట్టలేదంటున్న సనాఖాన్

డైరెక్టర్లు, నిర్మాతల దగ్గర అవకాశాలకోసం అడుక్కుంటోందని తనపై వస్తున్న ఆరోపణలను నటి సనాఖాన్ వచ్చే తిప్పికొట్టింది. సినిమా చాన్సుల కోసం అడుక్కునే ఖర్మ తనకు పట్టలేదని, గుర్తింపు ఉన్న పాత్రల కోసం వెతకడం అడ

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (06:39 IST)
డైరెక్టర్లు, నిర్మాతల దగ్గర అవకాశాలకోసం అడుక్కుంటోందని తనపై వస్తున్న ఆరోపణలను నటి సనాఖాన్ వచ్చే తిప్పికొట్టింది. సినిమా చాన్సుల కోసం అడుక్కునే ఖర్మ తనకు పట్టలేదని, గుర్తింపు ఉన్న పాత్రల కోసం వెతకడం అడుక్కోవడం ఎలా అవుతుందని సనా ప్రశ్నించింది. 2014లో వచ్చిన జయహో చిత్రం తర్వాత మళ్లీ వెండి తెరపై కనిపించని సనా కొత్త అవకాశాలకోసం డైరెక్టర్లను, నిర్మాతలను వేడుకుంటున్నట్లు వదంతులు వస్తున్న నేపథ్యంలో సనా కాస్త ఘాటుగానే స్పందించింది.
 
 ‘‘అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే మనల్ని చాలా మందే స్పందిస్తుంటారు. కాని నేను గుర్తింపు ఉన్న పాత్రల కోసం వెతుకుతుండడంతో సినిమాల్లో కనిపించడానికి కాస్త గ్యాప్ వచ్చింది’’ అని అంటోంది నటి సనాఖాన్. నచ్చిన ప్రజెక్టు రాక ఇన్నాళ్లుగా ఖాళీగానే ఉన్నా, అంత మాత్రాన తన గురించి ఏదేదో అనుకోవద్దంది.
 
‘‘ఇంత గ్యాప్ వచ్చినప్పుడు సాధారణంగానే అవకాశాలు రాకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ల దగ్గరికెళ్లి సినిమా అవకాశాలు అడగడంలో తప్పేంటి? నేనేమీ ఊరికే డబ్బులు అడగడం లేదు కదా! నా నటనను వారికి అమ్ముకుంటున్నానంతే. డైరెక్టర్లు, నిర్మాతలు తమ సినిమాల్లో నన్ను తీసుకోవాలనుకునేంత గుర్తింపు నాకు లేదు. అలాంటప్పుడు వారిని అడగడం కూడా తప్పులేదు’’ అని చెప్పుకొచ్చింది సనా.
 
కత్తి, మిస్టర్ నూకయ్య లాంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ కొంతకాలంగా తెలుగులో అవకాశాలు రాక వెనుకబడటం వాస్తవం. అంతమాత్రాన అవకాశాలకోసం అడుక్కోవడం ఎమిటి అంటూ ప్రశ్నిస్తోంది సనా.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments